![Dawood Ibrahim wife test positive for coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/5/DAWOOD-IBRAHIM.jpg.webp?itok=jFfwVpG0)
ఇస్లామాబాద్ : ప్రపంచ ప్రజానీకంపై పగడవిప్పుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదలట్లేదు. పల్లె నుంచి పట్నం వరకు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందింది. తాజాగా అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, ఆయన భార్య కూడా కరోనా బారినపడ్డట్లు తెలిసింది. దావూద్‌కు పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో గల మిలటరీ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారని సమాచారం. తొలుత ఆయన భార్య మెహజీబేన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో దావూద్‌కు నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది. (లాక్‌డౌన్ ఎత్తివేత.. డబ్బు ఇవ్వలేం)
దావూద్‌తో పాటు మరికొంతమంది ఆయన వ్యక్తి సిబ్బందిని కూడా క్వారెంటైన్‌కు తరలించినట్లు తెలిసింది. అయితే ఈ వార్తలను పాక్ మీడియా తీవ్రంగా ఖండిస్తోంది. కాగా వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment