లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 3-2 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కాగా 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది.
ఇంగ్లండ్ కెప్టెన్ మొయిన్ అలీ అఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అఖరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. 8 పరుగులు మాత్రమే సాధించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో మొయిన్ (అలీ 51 పరుగులు నటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అదే విధంగా పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు, నవాజ్, వసీం, షాదాబ్ ఖాన్, ఆహ్మద్, జమేల్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టి పాక్‌ను దెబ్బతీశాడు. అదే విధంగా సామ్ కరణ్, విల్లీ చెరో రెండు వికెట్లు.. క్రిస్ వోక్స్ ఒక్క వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో మరో సారి మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రిజ్వాన్ 46 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.
చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment