Gaddafi stadium
-
ఇదేమి ఖర్మరా బాబు.. క్రికెట్ స్టేడియంలో కెమరాలు చోరీ! పాక్‌లో అంతే?
ప్రస్తుతం జరుగున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఈ ఏడాది ఈ లీగ్‌కు కరాచీ, ముల్తాన్, రావల్పిండి, లాహోర్ అతిథ్యం ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రావల్పిండి, లాహోర్‌లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఫిబ్రవరి 26(ఆదివారం) లాహోర్ క్యాలండెర్స్, పెషావర్ జల్మీ మ్యాచ్‌తో లాహోర్ లెగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ భద్రత కోసం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలు చోరికి గురయ్యాయి. సెక్యూరిటీ కెమెరాలతో పాటు జనరేటర్ బ్యాటరీలు, ఫైబర్ కేబుల్స్ కూడా ఎత్తుకుపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చోరీకి గురైన వస్తువులన్నీ దాదాపు కోటి రూపాయలు విలువ చేస్తాయని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఇందుకు సంబంధించి గుల్బర్గ్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా గడ్డాఫీ స్టేడియంలోనే క్వాలిఫియర్, ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో మరో సారి భద్రతా వైఫల్యం తలెత్తడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: 'ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియాదే' -
PAK vs ENG: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై పాక్ విజయం
లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 3-2 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కాగా 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ మొయిన్ అలీ అఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. 8 పరుగులు మాత్రమే సాధించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో మొయిన్ (అలీ 51 పరుగులు నటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు, నవాజ్, వసీం, షాదాబ్ ఖాన్, ఆహ్మద్, జమేల్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టి పాక్‌ను దెబ్బతీశాడు. అదే విధంగా సామ్ కరణ్, విల్లీ చెరో రెండు వికెట్లు.. క్రిస్ వోక్స్ ఒక్క వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో మరో సారి మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రిజ్వాన్ 46 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
నోరు పారేసుకున్న క్రికెటర్
లాహోర్: వివాదాలకు చిరునామాగా ఉండే పాకిస్థానీ ఆల్ రౌండర్, టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి నోటి దురుసుతనాన్ని ప్రదర్శంచాడు. బుధవారం లాహోర్ లోని గడాఫీ నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అఫ్రిది.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక ఆగ్రహంతో ఊగిపోయాడు. అతణ్ని దూషిస్తూ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. అక్కడ అసలేం జరిగిందంటే.. మార్చిలో భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే పాక్ జట్టుకు అఫ్రిదియే సారధి. అయితే టీ20 కెప్టెన్ గా మిగతా అందరికంటే అఫ్రిదీకి చెత్త రికార్డుంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'మీ ఆట, జట్టు తీరును ఎలా మెరుగుపర్చుకుంటారు?' అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి బదులుగా 'నువ్వింత ఏడుపుగొట్టు, చచ్చు ప్రశ్న అగుడుతావని నాకు ముందే తెలుసు' అనేసి కోపంగా వెళ్లిపోయాడు అఫ్రిది. క్రికెటర్ చర్యతో విస్తుపోయిన విలేకరులు.. క్షమాపణ చెప్పాల్సిందిగా డ్రస్సింగ్ రూమ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే పీసీబీ చైర్మన్ షహర్యాన్ ఖాన్ దీనినొక చిన్న సంఘటనగా కొట్టిపారేశారు.