పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్ విజయ పరంపర కోనసాగిస్తోంది. శనివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగల భారీ స్కోర్ సాధించింది. ముల్తాన్ సుల్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (82) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా రిజ్వాన్‌తో పాటు టిమ్ డేవిడ్ తుపాన్ ఇన్నింగ్స్ తోడు అవడంతో ముల్తాన్ సుల్తాన్ భారీ స్కోర్ చేయగల్గింది. డేవిడ్ కేవలం 19 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు,2 ఫోర్లు ఉన్నాయి.
ఇక 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ జల్మీ 165 పరుగులకే ఆలౌటైంది. పెషావర్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(43), బెన్ కట్టింగ్(52) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లలో షానవాజ్ దహానీ, తాహిర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా,ముజారబానీ రెండు వికెట్లు సాధించారు. ఇక 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మద్ రిజ్వాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment