ఈ ఏడాది కొన్ని క్రికెట్ జట్లకు మధురానుభూతులు పంచితే.. మరికొన్ని టీమ్‌లకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ముఖ్యంగా తమకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి ఆస్ట్రేలియా పండుగ చేసుకుంటే.. టీమిండియా కనీసం మెగా టోర్నీ సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. మరోవైపు భారత దాయాది జట్టు పాకిస్తాన్ మాత్రం ఈ మేజర్ ఈవెంట్ టైటిల్ గెలవలేకపోయినా.. పూర్తి స్థాయి పోరాటపటిమ కనబరించింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి గానూ తన అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే... ఇద్దరు పాక్ ఆటగాళ్లకు చోటిచ్చాడు. టీమిండియా నుంచి జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో చాట్ సందర్భంగా.... జట్టు ఎంపికలో తాను పరిగణనలోకి తీసుకున్న అంశాలను ప్రస్తావించాడు. ‘‘బాబర్ ఆజమ్.. మహ్మద్ రిజ్వాన్ ఇద్దరి గణాంకాలు బాగానే ఉన్నాయి.
ఇద్దరి స్ట్రైక్ రేటు దాదాపుగా.. 130 ఉంది. ఇద్దరికీ ఈ ఏడాది చాలా బాగా కలిసివచ్చింది. అయితే, పవర్‌ప్లేలో స్ట్రేక్ రేటును బట్టి వీరిద్దరిలో నేను రిజ్వాన్ వైపే మొగ్గు చూపుతాను. ఇక ఆల్‌రౌండర్ల విషయానికొస్తే ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్‌ను ఎంపిక చేసుకుంటాను. బౌలర్లలో రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, బుమ్రాను ఎంచుకుంటాను. ఓపెనర్లుగా జోస్ బట్లర్, రిజ్వాన్ నా ఛాయిస్’’ అని హర్షా బోగ్లే చెప్పుకొచ్చాడు.
హర్షా బోగ్లే 2021 అత్యుత్తమ టీ20 జట్టు:
జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్, మిచెల్ మార్ష్, మొయిన్ అలీ, గ్లెన్ మాక్స్‌వెల్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, జస్‌ప్రీత్ బుమ్రా.
చదవండి: David Warner: ఎంతైనా వార్నర్ కూతురు కదా.. ఆ మాత్రం ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment