Update: ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు పాకిస్తాన్ కీలక ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులోకి వచ్చారు. రిజ్వాన్ 67 పరుగులతో ఆకట్టుకోగా... షోయబ్ మాలిక్ మాత్రం నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుది. మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.
Mohammad Rizwan, Shoaib Malik Doubtful For Semis Against Australia: టీ20 ప్రపంచకప్-2021లో ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్‌లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు గత రెండు రోజులు నుంచి ఫ్లూ జ్వరంతో బాధపడతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉంటారో లేరోనన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి.
ఒకవేళ ఈ మ్యాచ్‌కు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో లేకపోతే వారి స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీకు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరిని మ్యాచ్‌కు సిద్ధంగా ఉండమని పీసీబీ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ విజయంలో రిజ్వాన్, మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 11న (గురువారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌పై విజయంతో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment