మహ్మద్ రిజ్వాన్(PC: ICC)
ICC T20 World Cup 2021 Semi Final PAK Vs AUS: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అదరగొట్టిన పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డాక్టర్ నజీబుల్లా సుమ్రొ సంచలన విషయాలు వెల్లడించాడు. వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో అనారోగ్యం బారిన పడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కోలుకునేందుకు నిషేధిత పదార్థాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
కాగా యూఏఈ వేదికగా సాగిన ఐసీసీ పొట్టి ఫార్మాట్ ఈవెంట్‌లో పాకిస్తాన్ అజేయ రికార్డును కొనసాగిస్తూ సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు రిజ్వాన్ తీవ్ర చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ఐసీయూలో చికిత్స పొందిన అతడు అనూహ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడమే కాదు.. 52 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు.
PC: Shoaib Akhtar Instagram
అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలగేరడంతో పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూలు.. ఆపై ఫైనల్ చేరి.. అక్కడ న్యూజిలాండ్‌ను ఓడించి తొలిసారి ట్రోఫీ గెలిచారు. ఇదిలా ఉంటే.. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక మైదానంలో దిగాడంటూ అప్పట్లో రిజ్వాన్‌పై ప్రశంసలు కురిశాయి. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే రిజ్వాన్‌కు ఆట పట్ల ఉన్న అంకితభావం, దేశం కోసం ఆడాలన్న తపన చూసి గర్వపడుతున్నానంటూ పేర్కొన్నాడు. మిగతా పాక్ క్రికెటర్లు సైతం అతడిని ప్రశంసించారు.
అయితే, ఈ ఘటన గురించి రిజ్వాన్‌కు చికిత్స అందించిన డాక్టర్ నజీబుల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు.. ‘‘నువ్వు అసలు శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు కోలుకోవాలంటే నీకు ఇంజెక్ట్ చేయాల్సిన మెడిసన్ గురించి ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నిజానికి ఆ మెడిసిన్ అథ్లెట్లు వాడటం నిషేధం. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకు కచ్చితంగా ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలి’’ అని రిజ్వాన్‌తో ఇంటర్వ్యూలో నజీబుల్లా వ్యాఖ్యానించాడు. కాగా నజీబుల్లా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి.
చదవండి👉🏾MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని
చదవండి👉🏾IPL 2022: ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment