పాక్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడు.. ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు | Australia All Rounder Ashton Agar Receives Death Threat Ahead Of Pakistan Series | Sakshi

Ashton Agar: నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడు.. పాక్ ప‌ర్య‌ట‌న‌కు ముందు ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు

Feb 28 2022 9:12 PM | Updated on Feb 28 2022 10:08 PM

Australia All Rounder Ashton Agar Receives Death Threat Ahead Of Pakistan Series - Sakshi

Pakistan Vs Australia: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన‌ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే బెదిరింపుల ప‌ర్వం మొద‌లైంది. పాక్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తే నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగిరాడంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ ఆస్ట‌న్ అగ‌ర్‌ భార్యకు సోష‌ల్‌మీడియా వేదిక‌గా బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విష‌య‌మై అగ‌ర్ భార్య మెడిలీన్ క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు ఫిర్యాదు చేయ‌గా, ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా విచారణ చేపట్టాయి. 


భార‌త్ కేంద్రంగా ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్‌వచ్చినట్లు ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని, ఈ బెదిరింపు మెసేజ్‌ను అంత సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ప‌నిలేద‌ని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పేర్కొన్నాయి. కాగా, పాట్ క‌మిన్స్ సార‌ధ్యంలోని ఆస్ట్రేలియా జ‌ట్టు ఫిబ్ర‌వ‌రి 27న పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆసీస్‌ 3 టెస్ట్‌లు, 3 వ‌న్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. మార్చి 4న రావల్పిండి వేదిక‌గా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
చ‌ద‌వండి: విండీస్ స్పిన్ దిగ్గ‌జం క‌న్నుమూత‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement