Ashton Agar
-
వరల్డ్‌కప్ జట్టును అధికారికంగా ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఒక్క మార్పు
క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ 2023లో పాల్గొనే తమ జట్టును కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో ఊహించిన విధంగానే గాయం నుంచి పూర్తి కోలుకోని ఆస్టన్ అగర్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో మార్నస్ లబూషేన్ జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న ట్రవిస్ హెడ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మిగతా జట్టంతా ముందుగా ప్రకటించిన విధంగా యథాతథంగా కొనసాగుతుంది. Australia, here's your squad to take on the ODI World Cup in India starting on October 8! Congratulations to all players selected 👏 #CWC23 pic.twitter.com/xZAY8TYmcl — Cricket Australia (@CricketAus) September 28, 2023 కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా కొద్ది రోజుల కిందట తమ వరల్డ్‌కప్ ప్రొవిజనల్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళ (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో సీఏ ఓ మార్పు చేసింది. ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన లబూషేన్ ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, గాయపడిన అగర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే ఆస్ట్రేలియా జట్టు ఇదే: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయం కారణంగా ప్రపంచకప్ తొలి భాగానికి దూరమవుతాడనుకున్న ట్రవిస్ హెడ్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తుంది. హెడ్ స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వస్తాడనుకున్న మార్నస్ లబూషేన్ ఇతర ఆటగాడి రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆసీస్ ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ కాలి కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో లబూషేన్ ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది. తొలుత అగర్‌కు రీప్లేస్‌మెంట్‌గా మాథ్యూ షార్ట్ లేదా తన్వీర్ సంగాను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీమిండియాతో ఆఖరి వన్డేలో మ్యాక్స్‌వెల్ బంతితో రాణించడంతో (4 వికెట్లు) స్పిన్నర్‌కు బదులు ప్రొఫెషనల్ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే క్రికెట్ ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ప్రకటించకపోగా.. లబూషేన్‌ను అగర్ స్థానంలో జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది. అగర్ స్థానంలో వరల్డ్‌కప్ జట్టులోకి వస్తామని కలలు కన్న మాథ్యూ షార్ట్, తన్వీర్ సంగాకు ఈ ఊహించని పరిణామంతో నిరాశే ఎదురైంది. మ్యాక్స్‌వెల్ స్పిన్నర్‌గా రాణించి ఈ ఇద్దరి ఆశలను అడియాసలు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ స్థానాన్ని మ్యాక్సీ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా నమ్మకంగా ఉంది. పై పేర్కొన్న మార్పులకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..
వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ అష్టన్ అగర్ గాయం కారణంగా వరల్డ్‌కప్ టోర్నీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. అగర్ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అగర్‌కు గాయమైంది. అదే విధంగా తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వడంతో ప్రోటీస్ సిరీస్ మధ్యలోనే అగర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన 'ది డైలీ టెలిగ్రాఫ్' వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. అగర్ తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ వేదికగా జరిగే ప్రధాన టోర్నీకి అతడు దూరం కానున్నట్లు సమాచారం. ఇక ఆగర్ స్ధానంలో ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ లేదా స్పిన్నర్ తన్వీర్ సంగాను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరల్డ్‌కప్‌కు దూరం కాగా.. ఇప్పుడు అగర్ కూడా దూరమైతే ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న టీమిండియాతో తలపడనుంది. చదవండి: World Cup 2023: 'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు' Ashton Agar has reportedly been ruled out of the upcoming World Cup in India 😔#CWC23 https://t.co/JriBLkpTT8 — Fox Cricket (@FoxCricket) September 28, 2023 -
BGT 2023: ఇంటిబాట పట్టిన మరో ఆసీస్ ప్లేయర్.. ఈసారి ఆల్‌రౌండర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్ మ్యాచ్‌కు (మార్చి 1 నుంచి ప్రారంభం) ముందు ఆసీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఇంటిబాట పడుతున్నారు. అసలే 0-2 తేడాతో సిరీస్‌లో వెనుకపడిన ఆసీస్‌కు.. ఈ విషయం మరింత ఇబ్బందికరంగా మారింది. గాయాల కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిరీస్ మొత్తం నుంచే నిష్క్రమించగా, వ్యక్తిగత కారణాల చేత కెప్టెన్ కమిన్స్ పాక్షికంగా లీవ్ తీసుకున్నాడు. తాజాగా మరో ఆటగాడు స్వదేశంలో జరిగే దేశవాలీ టోర్నీల్లో ఆడేందుకు జట్టును వీడాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ, మార్ష్ కప్ ఫైనల్ ఆడేందుకు స్వదేశానికి బయల్దేరాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కని అగర్‌ను ఆసీస్ యాజమాన్యమే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. జట్టులో స్పిన్నర్లు అధికంగా ఉండటంతో అగర్‌ను ఉద్దేశపూర్వకంగానే తప్పించినట్లు తెలుస్తోంది. నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ రాణిస్తుండటంతో అగర్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమని భావించి ఆసీస్ మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు రెండో టెస్ట్‌కు ముందు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిన స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ తిరిగి జట్టులో చేరాడు. స్వెప్సన్ గైర్హాజరీలో రెండో టెస్ట్‌లో మాథ్యూ కుహ్నేమన్ ఆడాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే కోహ్లి వికెట్ తీసిన కుహ్నేమన్ కూడా పర్వాలేదనిపించాడు. ఒక్కొక్కరుగా ఆటగాళ్లు వైదొలుగుతుండటంతో సిరీస్‌పై ఆశలు వదులుకున్న ఆసీస్‌కు ఓ విషయంలో మాత్రం ఊరట లభించింది. ఫిట్నెస్ సమస్య కారణంగా తొలి రెండు టెస్ట్‌ల్లో ఆడని పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నట్లు ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయం కారణంగా తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సన్నద్ధతపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే.. గాయాలు, ఆటగాళ్ల పేలవ ఫామ్ తదితర సమస్యల కారణంగా ఆసీస్ సిరీస్‌పై ఆశలు వదులుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ కాకుండా కాపాడుకోవడమే ప్రస్తుతం ఆసీస్ ముందున్న లక్ష్యమని అర్ధమవుతుంది. -
BGT 2023: ‘అతడికి ఘోర అవమానం.. అసలు ఎందుకు సెలక్ట్ చేశారు?’
India vs Australia, 2nd Test: భారత పర్యటనలో అష్టన్ అగర్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ అన్నాడు. అందుకే అతడు స్వదేశానికి తిరిగి వచ్చే యోచనలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అగర్‌ను టీమిండియాతో మ్యాచ్‌లలో ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదని.. అలాంటపుడు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. కాగా ఇప్పటి వరకు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ 9 వికెట్లు తీశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్ సందర్భంగా టెస్టు ఆడాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అష్టన్ అగర్. రెండుసార్లు మొండిచేయి ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్‌కు అనూలించే ఉపఖండ పిచ్‌లపై కీలక సిరీస్ నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లకు స్థానం కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆష్టన్ అగర్(లెఫ్టార్మ్ స్పిన్నర్), నాథన్ లియాన్(రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్(రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్)లతో పాటు 22 ఏళ్ల ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని తొలి టెస్టులో అరంగేట్రం చేసిన మర్ఫీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. అష్టన్ అగర్ అరంగేట్రం చేసిన యువ ప్లేయర్లు ఇలా ఇక మిచెల్ స్వెప్సన్ తన బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి పయనం కాగా.. మాథ్యూ కుహ్నెమన్‌ను భారత్‌కు పంపించింది యాజమాన్యం. ఈ క్రమంలో స్వెప్సన్ స్థానంలో వచ్చిన కుహ్నెమన్ ఢిల్లీ టెస్టుతో అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి టెస్టులో 2 వికెట్లతో రాణించాడు. ఇలా వీరిద్దరు ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్(మొత్తం 8 వికెట్లు )తో పాటు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, అష్టన్ అగర్‌కు మాత్రం ఈ రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఘోర అవమానం ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్.. అష్టన్ అగర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘జట్టుకు ఎంపికకావడం, విదేశీ పర్యటనల్లో జట్టుతో పాటే ఉండటం.. అయినా ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాకపోవడం.. నిజంగా పెద్ద అవమానమే! అందుకే అతడు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు’’ అని ఆస్ట్రేలియా రేడియో చానెల్లో గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. అగర్‌ను మేనేజ్మెంట్ దారుణంగా అవమానిస్తోందని చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో ఓడి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఛాన్స్‌ను మరింత సంక్లిష్టం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఇండోర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ BGT 2023: మూడో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. సిరీస్ నుంచి వైదొలిగిన స్టార్ బౌలర్ -
కళ్లు చెదిరే విన్యాసం.. క్యాచ్ పట్టకపోయినా సంచలనమే
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ కళ్లు చెదిరే విన్యాసం అందరిని ఆకట్టుకుంది. క్యాచ్ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయేది. అయితే క్యాచ్ మిస్ అయినప్పటికి అతని విన్యాసం మాత్రం సంచలనమే అవుతుంది. ఎందుకంటే సిక్సర్ వెళ్లాల్సిన బంతిని కేవలం ఒక్క పరుగుకే పరిమితం చేసి ఐదు పరుగులు సేవ్ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ 45వ ఓవర్లో అప్పటికే సెంచరీతో దుమ్మురేపుతున్న డేవిడ్ మలాన్ కమిన్స్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. చాలా హైట్‌లో వెళ్లిన బంతి వెళ్లడంతో కచ్చితంగా సిక్స్ అని అభిప్రాయపడ్డారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న ఆస్టన్ అగర్ సూపర్మ్యాన్లా పైకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు. అయితే అప్పటికే బౌండరీ లైన్ దాటేయడంతో క్యాచ్ పట్టినా ఉపయోగముండదు. అందుకే బంతిని వెంటనే బౌండరీ లైన్ అవతలకు విసిరేసిన తర్వాతే కిందపడ్డాడు. అలా ఆరు పరుగులు రావాల్సింది పోయి ఇంగ్లండ్‌కు ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆస్టన్ అగర్ విన్యాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకముందు లియామ్ డాసన్‌ను కూడా ఆస్టన్ అగర్ తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక డేవిడ్ మలాన్ సెంచరీతో(128 బంతుల్లో 134 పరుగులు, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. డేవిడ్ విల్లీ(34 నాటౌట్), జాస్ బట్లర్(29 పరుగులు) మలాన్‌కు సహకరించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడమ్ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు. That's crazy! Take a bow, Ashton Agar #AUSvENG pic.twitter.com/FJTRiiI9ou — cricket.com.au (@cricketcomau) November 17, 2022 చదవండి: చేసిందే తప్పు.. పైగా అంపైర్‌ను బూతులు తిట్టాడు స్టార్క్ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్ వీడియో -
చేసిందే తప్పు.. పైగా అంపైర్‌ను బూతులు తిట్టాడు
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ ఫీల్డ్ అంపైర్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో సహనం కోల్పోయిన అగర్ అంపైర్‌ను బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. క్రీజులో కుదురుకున్న డేవిడ్ మలాన్, సామ్ బిల్లింగ్స్ జోడిని విడదీయడానికి కమిన్స్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ చేతికి బంతినిచ్చాడు. బంతితో వికెట్లు తీయాల్సింది పోయి.. బంతి వేసిన తర్వాత పదే పదే పిచ్‌పైకి వస్తూ బ్యాటర్లను అడ్డుకున్నాడు. ఇది చూసిన ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ అగర్‌ను హెచ్చరించాడు. ''పదే పదే పిచ్‌పై పరిగెత్తడం కరెక్ట్ కాదు..'' అంపైర్ అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇది విన్న అగర్ వెంటనే.. ''మీరు అనేది ఏంటి.. నేను బంతిని అంచనా వేయడానికి మాత్రమే పరిగెడుతున్నా'' అంటూ సమాధానమిచ్చాడు. అగర్ సమాధానంతో ఏకీభవించని అంపైర్.. ''బ్యాటర్ బంతిని కొట్టింది మిడ్ వికెట్ వైపు.. నువ్వు పిచ్‌పైకి ఎందుకు వస్తున్నావు.. అంటే బ్యాటర్‌ను అడ్డుకోవడానికే కదా'' అంటూ తెలిపాడు. ఇది విన్న అగర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. అంపైర్ మీదకు దూసుకొచ్చిన అగర్ అసభ్యకరమైన పదంతో దూషించాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఆ తర్వాత కూడా అగర్, పాల్ రీఫెల్లు వాదులాడుకోవడం కనిపించింది. అయితే ఫీల్డ్ అంపైర్‌తో వాదనకు దిగినందుకు ఆస్టన్ అగర్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఆదిలోనే శుభారంభం ఇచ్చాడు. 14 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్‌ను పెవిలియన్ చేర్చగా.. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ జేసన్ రాయ్‌ను ఆరు పరుగుల వద్ద సూపర్ బౌలింగ్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే ఒక ఎండ్‌లో డేవిడ్ మలాన్ స్థిరంగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరుబోర్డు ముందుకు కదిలింది. సామ్ బిల్లింగ్స్, కెప్టెన్ బట్లర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన మలాన్ శతకంతో మెరిశాడు. 128 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక చివర్లో డేవిడ్ విల్లే 40 బంతుల్లో 34 నాటౌట్ దాటిగా ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడమ్ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు. “What do you mean⁉" Ashton Agar wasn't having it from Paul Reiffel 👀https://t.co/FQjowjYEKS — Fox Cricket (@FoxCricket) November 17, 2022 చదవండి: Video: స్టార్క్ దెబ్బ.. రాయ్‌కు దిమ్మతిరిగిపోయింది! వైరల్ వీడియో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
శ్రీలంకతో రెండో వన్డే.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో రెండో వన్డే ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్లు మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నారు. పల్లెకెల్లె వేదికగా జరిగిన తొలి వన్డేలో వీరిద్దరూ గాయపడ్డారు. ఇప్పటికే మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, సీన్ అబాట్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా ఈ జాబితాలో స్టోయినిస్,అగర్ కూడా చేరారు. ఇక వీరిద్దరి స్థానంలో ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్ జట్టులోకి రానున్నారు. కాగా తొలి వన్డేలో స్టోయినిస్ 44 పరుగులతో రాణించగా.. అగర్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో శ్రీలంకపై ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే పల్లెకెల్లె వేదికగా గురువారం జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
పాక్ పర్యటనకు వెళ్తే నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడు.. ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు
Pakistan Vs Australia: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే బెదిరింపుల పర్వం మొదలైంది. పాక్ పర్యటనకు వెళ్తే నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ భార్యకు సోషల్‌మీడియా వేదికగా బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయమై అగర్ భార్య మెడిలీన్ క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు ఫిర్యాదు చేయగా, ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా విచారణ చేపట్టాయి. భారత్ కేంద్రంగా ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్వచ్చినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని, ఈ బెదిరింపు మెసేజ్‌ను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పేర్కొన్నాయి. కాగా, పాట్ కమిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 27న పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టెస్ట్‌లు, 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. మార్చి 4న రావల్పిండి వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: విండీస్ స్పిన్ దిగ్గజం కన్నుమూత -
మెరిసిన మ్యాక్స్‌వెల్, అగర్
వెల్లింగ్టన్: బ్యాట్‌తో మ్యాక్స్‌వెల్ (31 బంతుల్లో 70; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు... బంతితో యాష్టన్ అగర్ (6/30) మాయాజాలం... వెరసి న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగులతో తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీ చేశాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అగర్ స్పిన్ వలలో చిక్కుకొని 17.1 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. గప్టిల్ (43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కాన్వే (38; 5 ఫోర్లు, సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా (అజంతా మెండిస్, యజువేంద్ర చహల్ రెండుసార్లు చొప్పున తీశారు), ఆసీస్ నుంచి తొలి బౌలర్‌గా అగర్ గుర్తింపు పొందాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2–1తో ఆధిక్యంలో ఉండగా... నాలుగో టి20 శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. -
ఆగర్ దూసుకొస్తున్నాడు..!
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆస్టన్ ఆగర్ తన ర్యాంకింగ్స్‌లో కూడా దూసుకొస్తున్నాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒకేసారి ఆరు స్థానాలు ఎగబాకి నాల్గో స్థానానికి చేరుకున్నాడు. సఫారీలతో తొలి టీ20లో ఐదు వికెట్లు సాధించిన ఆగర్.. మూడో టీ20లో మూడు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో ఎనిమిది వికెట్లను ఆగర్ సాధించాడు. ఫలితంగా 712 రేటింగ్ పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌కే చెందిన మరో స్పిన్నర్ ఆడమ్ జంపా 713 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 749 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో ఉండగా, అఫ్గాన్‌కే చెందిన ముజిబ్ ఉర్ రహ్మాన్ 742 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టాప్-10లో భారత బౌలర్లకు ఎవరూ చోటు దక్కించుకోలేదు.(ఇక్కడ చదవండి: ‘జడేజానే నా ఫేవరెట్ ప్లేయర్’) ఇక బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 823 రేటింగ్ పాయింట్లతో రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గత నెలలో రెండో స్థానానికి ఎగబాకిన రాహుల్ దానిని పదిలం చేసుకున్నాడు. ఈ జాబితాలో బాబర్ అజామ్ 879 రేటింగ్ పాయింట్లతో టాప్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక్కడ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 10వ స్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ మూడో స్థానంలో, కోలిన్ మున్రో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ ప్లేయర్ మహ్మద్ నబీ 319 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ 212 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలవడగా, మ్యాక్స్‌వెల్ మూడో స్థానంలో ఉన్నాడు. -
అగర్ హ్యాట్రిక్
జొహన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు 107 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దాంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు పరుగుల పరంగా టి20ల్లో ఇదే అతిపెద్ద ఓటమి. అంతేకాకుండా సఫారీ జట్టుకు టి20ల్లో ఇదే అత్యల్ప స్కోరు. తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్మిత్ (45; 5 ఫోర్లు, సిక్స్), ఫించ్ (42; 6 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికాను ఆసీస్ స్పిన్నర్ అగర్ (5/24) ‘హ్యాట్రిక్’తో తిప్పేయడంతో... 14.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. సఫారీ జట్టు ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి మూడు బంతుల్లో డు ప్లెసిస్, ఫెలుక్వాయో (0), స్టెయిన్ (0)లను అవుట్ చేసిన అగర్ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇది 13వ హ్యాట్రిక్కాగా... ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ అగర్. -
‘జడేజానే నా ఫేవరెట్ ప్లేయర్’
-
హ్యాట్రిక్ హీరోకు నచ్చిన ప్లేయర్ ‘సర్’
జోహెనెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో ఆ దేశ స్పిన్నర్ ఆస్టన్ ఆగర్ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు సాధించి సఫారీల నడ్డివిరచడంతో పాటు హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. ఆగర్ దెబ్బకు 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 14.3 ఓవర్లలో 89 పరుగులకే చాపచుట్టేసింది. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ నాల్గో బంతికి డుప్లెసిస్‌ను ఔట్ చేసిన ఆగర్.. ఆ తర్వాత వరుస బంతుల్లో ఫెహ్లుక్వోయో, స్టెయిన్‌లను ఔట్ చేసి తన కెరీర్లో తొలి హ్యాట్రిక్‌ను అందుకున్నాడు.(ఇక్కడ చదవండి: దక్షిణాఫ్రికా అతి పెద్ద పరాజయం) ఇటీవల భారత్‌లో పర్యటించిన ఆసీస్ జట్టులో సభ్యుడైన ఆగర్ మూడు వన్డేల్లో కలిపి రెండు వికెట్లను మాత్రమే సాధించాడు. అయితే భారత టూర్‌కు తనను నామమాత్రంగా ఎంపిక చేయగా అది తనలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందని ఆగర్ చెప్పుకొచ్చాడు. భారత పర్యటన సందర్భంగా మనం ముద్దుగా పిలుచుకునే ‘ సర్’రవీంద్ర జడేజాతో చేసిన చాట్ ఎంతగానో ఉపయోగిపడిందట. ప్రపంచ క్రికెట్లో తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది జడేజానేనని ఆగర్ చెప్పుకొచ్చాడు. ఫీల్డ్‌లో జడేజా చేసిన ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నాడు. తనకు కూడా జడేజాలా రాణించాలని ఉందని ఆగర్ పేర్కొన్నాడు. ‘ జడేజా ఒక రాక్‌స్టార్..ఫీల్డ్‌లో అతను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఫీల్డింగ్‌లో చురుకుదనం, బంతిని స్పిన్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి భారత పర్యటనతో పాటు జడేజా కూడా కారణం’ అని ఆగర్ పేర్కొన్నాడు. -
తమ్ముడు కొట్టిన షాట్.. అన్నకు తీవ్ర గాయం
కారెన్ రోల్టన్ ఓవల్: ఆస్ట్రేలియా ఎడమచేతి స్పిన్నర్ ఆస్టన్ అగర్ తీవ్రంగా గాయపడ్డాడు. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్టన్ అగర్.. తమ్ముడు వెస్ అగర్ షాట్‌ను క్యాచ్ రూపంలో అందుకునే క్రమంలో గాయపడ్డాడు. సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న వెస్ ఆగర్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 41 ఓవర్‌ను మార్కస్ స్టోయినిస్ వేశాడు. ఆ ఓవర్లో వెస్ అగర్ మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆస్టన్ దాన్ని అందుకోవడానికి యత్నించాడు. ఆ బంతి కాస్త జారడంతో కనుబొమ్మల మధ్య నుదిటి భాగంలో తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. దాంతో ఫీల్డ్‌ను విడిచి వెళ్లిపోయాడు ఆస్టన్. రక్తంతో తడిచిన ముఖంతోనే మైదానాన్ని వీడగా ఆగర్ తిరిగి బరిలోకి దిగలేదు. ఈ టోర్నీకి ఆస్టన్ అగర్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గాయమైన చోట కుట్లు వేయాలని డాక్టర్లు సూచించగా అందుకు అగర్ నిరాకరించాడు. ప్లాస్టిక్ సర్జన్ ఆశ్రయిస్తానని పేర్కొన్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే కుట్లుకు ఆస్టన్ నిరాకరించాడు. ఈ ఘటనపై తమ్ముడు వెస్ అగర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇలా జరగడం బాధాకరమన్నాడు. గాయపడ్డ మరుక్షణం అతని ఆరోగ్యం గురించి కలత చెందానన్నాడు. దాంతోనే క్రీజ్‌ను వదిలి హుటాహుటీనా అన్న ఆస్టన్ దగ్గరకు వెళ్లానన్నాడు. ఈ గాయంతో పెద్ద ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు తెలపడంతో ఉపశమనం పొందానన్నాడు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. GRAPHIC CONTENT: Not for the faint-hearted, here is the footage of Agar's knock. Ouch! #MarshCup pic.twitter.com/h6Jj3drPsO — cricket.com.au (@cricketcomau) November 17, 2019 -
ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ
సాక్షి, ఇండోర్: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా ఉంది ఆస్ట్రేలియా పరిస్థితి. ఇప్పటికే వరుస ఓటములతో సీరీస్ కోల్పోయిన స్మిత్ సేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన ఇండోర్ వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న తరుణంలో స్మిత సేనకు ఊహించని షాక్ తగిలింది. స్పిన్నర్ ఆస్టన్ అగర్ చిటికెను వేలి గాయంతో మిగిలిన రెండు వన్డేలకు దూరం అయ్యాడు. ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో అగర్ బౌండరీని అడ్డుకునే క్రమంలో అతని కుడి చేతి చిటికెను వేలుకు గాయమైంది. మ్యాచ్ అనంతరం ఎక్స్‌రేలో వేలు విరిగినట్లు తేలడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలనే జట్టు డాక్టర్ సా సూచనల మేరకు అగర్ తిరుగు పయనమయ్యాడు. ఇప్పటికే స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై సతమతమవుతున్న ఆసీస్ బౌలింగ్ విభాగానికి తాజా ఘటనతో మరింత ఆందోళన నెలకొంది.