జొహన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు 107 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దాంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు పరుగుల పరంగా టి20ల్లో ఇదే అతిపెద్ద ఓటమి. అంతేకాకుండా సఫారీ జట్టుకు టి20ల్లో ఇదే అత్యల్ప స్కోరు.
తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్మిత్ (45; 5 ఫోర్లు, సిక్స్), ఫించ్ (42; 6 ఫోర్లు, సిక్స్) రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికాను ఆసీస్ స్పిన్నర్ అగర్ (5/24) ‘హ్యాట్రిక్’తో తిప్పేయడంతో... 14.3 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. సఫారీ జట్టు ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి మూడు బంతుల్లో డు ప్లెసిస్, ఫెలుక్వాయో (0), స్టెయిన్ (0)లను అవుట్ చేసిన అగర్ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇది 13వ హ్యాట్రిక్‌కాగా... ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ అగర్.
Comments
Please login to add a commentAdd a comment