భారత్‌లో పర్యటించిన ఆసీస్ జట్టులో సభ్యుడైన ఆగర్ మూడు వన్డేల్లో కలిపి రెండు వికెట్లను మాత్రమే సాధించాడు. అయితే భారత టూర్‌కు తనను నామమాత్రంగా ఎంపిక చేయగా అది తనలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందని ఆగర్ చెప్పుకొచ్చాడు. భారత పర్యటన సందర్భంగా మనం ముద్దుగా పిలుచుకునే ‘ సర్’రవీంద్ర జడేజాతో చేసిన చాట్ ఎంతగానో ఉపయోగిపడిందట. ప్రపంచ క్రికెట్‌లో తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది జడేజానేనని ఆగర్ చెప్పుకొచ్చాడు.