మ్యాచ్‌ను ‘టర్న్‌’ చేశాడు! | Jadeja Displays Incredible Reflexes In Return Catch To Dismiss Markram | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ను ‘టర్న్‌’ చేశాడు!

Published Sun, Oct 6 2019 3:38 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పేసర్‌ మహ్మద్‌ షమీ, స్పిన్నర్‌ రవీంద్ర జడేజాలు చెలరేగిపోవడంతో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్‌ చేసింది. నిన్నటి ఆటలో డీన్‌ ఎల్గర్‌ను త్వరగానే పెవిలియన్‌కు పంపగా, ఈ రోజు ఆటలో బ్రయాన్‌ ఆరంభంలోనే ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో సఫారీలు 19 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయారు. ఆపై బావుమాను డకౌట్‌గా షమీ పెవిలియన్‌కు పంపడంతో సఫారీలు కష్టాల్లో పడ్డారు. ఆదివారం ఆటను మొత్తంగా చూస్తే జడేజా బౌలింగ్‌ మ్యాచ్‌ హైలెట్‌గా నిలిచింది. 27 ఓవర్‌ తొలి బంతికి మార్కరమ్‌ను ఔట్‌ చేసిన జడేజా.. అదే ఓవర్‌ నాల్గో బంతికి ఫిలిండర్‌ను, ఐదో బంతికి మహరాజ్‌లను డకౌట్‌ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement