ఉమేశ్‌ సిక్సర్ల మోత | Umesh Hit Five Sixes Against South Africa | Sakshi
Sakshi News home page

ఉమేశ్‌ సిక్సర్ల మోత

Published Sun, Oct 20 2019 4:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

జడేజా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. జార్జ్‌ లిండే వేసిన 112 ఓవర్‌ ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్లుగా కొట్టిన ఉమేశ్‌.. లిండే వేసిన 114 ఓవర్‌ తొలి బంతిని సిక్స్‌గా కొట్టాడు. ఆపై మూడో బంతిని కూడా సిక్స్‌గా మలచగా, ఐదో బంతిని సైతం సిక్స్‌ కొట్టాడు.  మళ్లీ భారీ షాట్‌ కొట్టబోయి ఆ ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. 10 బంతుల్లో ఓవరాల్‌గా ఐదు సిక్సర్లు కొట్టిన ఉమేశ్‌(31) తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. అయితే భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 497/9వద్ద డిక్లేర్డ్‌ చేసింది. భారత్‌ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసే సమయానికి షమీ(10 నాటౌట్‌), నదీమ్‌(1 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement