పుణే టెస్టులో టీమిండియా ఘన విజయం | Dominant India Clinch Series Against South Africa | Sakshi
Sakshi News home page

పుణే టెస్టులో టీమిండియా ఘన విజయం

Published Sun, Oct 13 2019 3:23 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌కు దిగిన దక్షిణాఫ్రికా 67.2 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. దాంతో  కోహ్లి అండ్‌ గ్యాంగ్‌  ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల ఇన్నింగ్స్‌ టీ బ్రేక్‌ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌(48), బావుమా(38), ఫిలిండర్‌(37), మహరాజ్‌(22)లు  మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా దారుణంగా విఫలయ్యారు. ఫలితంగా భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయాన్ని అప్పగించాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement