
శ్రీలంకతో రెండో వన్డే ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌లు మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నారు. పల్లెకెల్లె వేదికగా జరిగిన తొలి వన్డేలో వీరిద్దరూ గాయపడ్డారు. ఇప్పటికే మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, సీన్ అబాట్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు.
తాజాగా ఈ జాబితాలో స్టోయినిస్,అగర్ కూడా చేరారు. ఇక వీరిద్దరి స్థానంలో ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్ జట్టులోకి రానున్నారు. కాగా తొలి వన్డేలో స్టోయినిస్ 44 పరుగులతో రాణించగా.. అగర్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో శ్రీలంకపై ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే పల్లెకెల్లె వేదికగా గురువారం జరగనుంది.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..!
Comments
Please login to add a commentAdd a comment