పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు స్పిన్ కన్సల్టెంట్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ధృవీకరించింది. పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా లాహోర్‌లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఈ వైట్‌బాల్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ సలహాదారుగా వెట్టోరి వ్యవహరించనున్నాడు. కాగా వెట్టోరి 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.
అదే విధంగా గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఇక వెట్టోరి తన అంతర్జాతీయ కెరీర్‌లో 705 వికెట్లు సాధించాడు. వాటిలో 365 టెస్టు, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి రెండు టెస్టులు డ్రా ముగిశాయి. ఇక సిరీస్‌లో అఖరి టెస్టు లాహోర్ వేదికగా జరుగుతోంది. మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది.
చదవండి: IPL 2022: చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఓపెనర్ వచ్చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment