రాయల్స్ కెప్టెన్గా వాట్సన్.. మెంటర్ ద్రావిడ్
ముంబై: త్వరలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ నియమితులయ్యాడు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో వాట్సన్కు జట్టు పగ్గాలు అప్పగించినట్టు రాయల్స్ యాజమాన్యం ప్రకటించింది. గతేడాది ఐపీఎల్ సీజన్ అనంతరం ద్రావిడ్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. కాగా ద్రావిడ్ రాయల్స్ మెంటర్గా వ్యవహరిస్తాడు. ద్రావిడ్ యువ క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంతో పాటు జట్టుకు మార్గనిర్దేశకం చేస్తాడని రాయల్స్ యాజమాన్యం పేర్కొంది. రాయల్స్ కెప్టెన్గా తొలుత ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, అనంతరం ద్రావిడ్ పనిచేశారు. తాజాగా ఆస్ట్రేలియాకే చెందిన 32 ఏళ్ల వాట్సన్ రాజస్థాన్కు సారథ్యం వహిస్తాడు.