
కొడుకుతో సీఎస్‌కే ఆటగాడు షేన్ వాట్సన్
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌తో క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి ఫ్రాంఛైజీలు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తమ జట్టు ఆటగాళ్లను అభినందిస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. అంతేకాదు విరామ సమయాల్లో వారు చేసే అల్లరిని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)టీమ్ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 11లో సీఎస్‌కేకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కుటుంబంతో పాటు భారత్‌కు విచ్చేసిన షేన్ వాట్సన్ తన కుమారుడితో కలిసి హోటల్ కారిడార్‌లో ఫుట్‌బాల్ ఆడాడు. సరదా కోసం ఆడుతున్నప్పటికీ వాట్సన్ కుమారుడు మాత్రం గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. బాల్ కోసం తండ్రిని వెనక్కి నెట్టేస్తూ మరీ పోటీపడ్డాడు. కొడుకు పట్టుదలను చూసిన వాట్సన్.. అతని ఆటను ఎంజాయ్ చేస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు. ‘వట్టూ బ్రేకింగ్ ద వట్టూ డిఫెన్స్’ అంటూ ఈ తండ్రీ కొడుకుల సరదా వీడియోను సీఎస్‌కే టీమ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Watto breaking the Watto defence! #WhistlePodu 🦁💛 @ShaneRWatson33 pic.twitter.com/zqPuVfUtT8
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2018