రైనా నిష్క్రమణ.. వాట్సన్‌ ఆవేదన | You are the heartbeat of CSK Shane Watson to Suresh Raina | Sakshi
Sakshi News home page

రైనా నిష్క్రమణ.. వాట్సన్‌ ఆవేదన

Published Sun, Aug 30 2020 4:18 PM | Last Updated on Sat, Sep 19 2020 3:40 PM

You are the heartbeat of CSK Shane Watson to Suresh Raina - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా అనుహ్య నిర్ణయంతో జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటివరకు నెట్‌ ప్రాస్టీక్స్‌తో మంచి ఊపుమీద కనిపించిన రైనా.. దుబాయ్‌ వెళ్లిన కొంతకాలానికే భారత్‌కు తిరుగుముఖం పట్టాడు. కరోనా భయంతోనే రైనా ఐపీఎల్‌ టోర్నీ తప్పుకున్నాడని ఓవైపు వార్తలు వస్తున్నా.. వ్యక్తిగత కారణాలతోనే నిష్క్రమించాడని సీఎస్‌కే యాజమాన్యం చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు లోటుపై సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. రైనా నిష్క్రమణ చెన్నై జట్టుతో పాటు ఐపీఎల్‌ టోర్నీకే పెద్ద లోటని అభిప్రాయపడ్డాడు. చెన్నై గుండె చప్పుడు రైనా అంటూ సోషల్‌ మీడియా వేదికగా వాట్సన్‌ ఓ వీడియోను విడుదల చేశాడు. (ఐపీఎల్‌కు సురేశ్‌ రైనా దూరం)

‘ఈరోజు పొద్దునే ఓ చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఐపీఎల్‌ టోర్నీ నుంచి సురేష్‌ రైనా వైదొలగడం బాధించింది. చెన్నైతో పాటు ఐపీఎల్‌ టోర్నీలోనే రైనా ఎంతో విలువైన ఆటగాడు. వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నా.. ఆయనకు, కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నా. జట్టు సభ్యులమంతా నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నాం’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు. కాగా రైనా మేనత్త భర్త అశోక్‌ కుమార్‌ ఆగస్ట్‌ 19న పంజాబ్‌లోని పఠాన్‌కోట సమీపంలో గుర్తుతెలియని దుండుగల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా గాయపడ్డారు.  ఈ కారణంగానే రైనా ఐపీఎల్‌ టోర్నీ నుంచి తప్పుకున్నాడని తొలుత వార్తులు వినిపించాయి. అయితే సహచర ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది కూడా కరోనా వైరస్‌ బారిన పడటంతో రైనా అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా భయం కారణంగానే టోర్నీ నుంచి తప్పుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. (సురేష్‌ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement