
భారీ స్కోరు దిశగా ఆసీస్
లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా దుమ్ముదులుపుతోంది. షేన్ వాట్సన్ సెంచరీ పైగా పరుగుల నమోదు చేసి అజేయంగా నిలవడంతో ఆసీస్ భారీ పరుగులు చేసే దిశగా పయనిస్తోంది. ఆసీస్ ఓపెనర్లు రోజర్స్(23), వార్నర్(6) లు ఆదిలోనే పెవిలియన్‌కు చేరి ఆసీస్‌ను నిరాశ పరిచారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన వాట్సన్ ఇంగ్లండ్ బౌలర్లకు పని చెబుతున్నాడు. వాట్సన్‌ను అవుట్ చేసేందుకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంగ్లండ్‌కు ఫలితానివ్వడం లేదు. 206 బంతులను ఎదుర్కొన్న వాట్సన్ 22 ఫోర్లు, 1 సిక్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు
. ప్రస్తుతం 74.0 ఓవర్ల ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. వాట్సన్‌కు తోడుగా, స్మిత్ (38) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్‌సన్‌కు రెండు వికెట్లు లభించగా, స్వాన్‌కు ఒక వికెట్టు దక్కింది. ఇప్పటికే ఇంగ్లండ్‌కు 3-0 తేడాతో సిరీస్‌ను అప్పగించిన ఆసీస్..ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.