IPL 2022: Shane Watson Officially Named As Delhi Capitals Assistant Coach, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022- Shane Watson: 41 ఏళ్ల వాట్సన్‌ తొలిసారిగా..

Published Wed, Mar 16 2022 8:49 AM | Last Updated on Wed, Mar 23 2022 5:52 PM

IPL 2022: Shane Watson Joined As Delhi Capitals Assistant Coach Official - Sakshi

IPL 2022- Delhi Capitals: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 41 ఏళ్ల వాట్సన్‌ కోచింగ్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ఢిల్లీ హెడ్‌ కోచ్‌ పాంటింగ్‌తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్‌ కోచ్‌లు అమ్రే, అగార్కర్‌లతో కలిసి అతను పని చేస్తాడు.

కాగా 2008నుంచి 2020 వరకు రాజస్తాన్, బెంగళూరు, చెన్నై జట్ల తరఫున వాట్సన్‌ మొత్తం 145 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌(2008)లో రాజస్తాన్‌ రాయల్స్‌ మొయిడెన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంలో వాట్సన్‌ పాత్ర మరువలేనిది. ఆ తర్వాత చెన్నైకి ఆడిన వాట్సన్‌ 2018లో ఐపీఎల్‌ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు మూడో ఐపీఎల్‌ టైటిల్‌ అందించడంలో కీలకంగా వ్యవహరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement