సన్‌రైజర్స్ జెర్సీలో వార్నర్ (పాత ఫొటో: PC- BCCI)
IPL 2023- David Warner: ‘‘డేవీ అద్భుతమైన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్‌గా తనకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు కోసం మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు. ఐపీఎల్‌లో డేవీ గణాంకాలు అత్యద్భుతం.
నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నాలుగైదు మ్యాచ్‌లలో తను విఫలమయ్యాడు. కానీ కేవలం పరుగులు సాధించని కారణంగా అతడిని తప్పించడం తెలివితక్కువతనం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నాడు.
బిత్తిరి చర్య
ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పట్ల సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు సరికాదని, పిచ్చితనంతో గొప్ప నాయకుడిని వదులుకున్నారని పేర్కొన్నాడు. కాగా సన్‌రైజర్స్ సారథిగా వ్యవహరించిన వార్నర్ 2016లో ఆ జట్టుకు టైటిల్ అందించాడు. సుదీర్ఘకాలం పాటు హైదరాబాద్‌కు ఆడిన వార్నర్‌ను అవమానకరరీతిలో బయటకు పంపింది యాజమాన్యం.
రిషభ్ పంత్‌తో వార్నర్ (PC: David Warner Instagram)
ఢిల్లీ కెప్టెన్‌గా
ఈ క్రమంలో గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గత సీజన్‌లో మొత్తంగా 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ భాయ్ 432 పరుగులతో రాణించాడు. అత్యధిక స్కోరు 92 నాటౌట్. ఇక పదిహేనో ఎడిషన్‌లో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచి పర్వాలేదనిపించిన విషయం తెలిసిందే.
అయితే, యాక్సిడెంట్‌కు గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ ఈసారి ఐపీఎల్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. వార్నర్ కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రశంసించాడు.
‘‘వార్నర్ గొప్ప నాయకుడు. గతేడాది ఢిల్లీ తరఫున ఉత్తమంగా రాణించాడు. బ్యాటర్‌గా తన వంతు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈసారి కెప్టెన్‌గా తన వ్యూహాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాడు’’ అని వాట్సన్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఏప్రిల్ 1న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: MS Dhoni- Rohit Sharma: మూడేళ్లుగా వింటున్నా..! మాకది తీరని లోటు.. అయితే..
హద్దు మీరి.. అభ్యంతరకరంగా! నెట్టింట షారుక్, కోహ్లి ఫ్యాన్స్ రచ్చ! ఎందుకురా తన్నుకుంటారు?
Comments
Please login to add a commentAdd a comment