
ఆస్ట్రేలియా వన్డే జట్టు నుంచి షేన్ వాట్సన్‌కు ఉద్వాసన
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు......
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు జట్టులో చోటు దక్కలేదు. సోమవారం రాడ్ మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ సెలక్టర్లు 13 మందితో కూడిన తమ జట్టును ప్రకటించారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌ల కోసం ఈ ఎంపిక జరిగింది. అయితే టెస్టులకు గుడ్‌బై చెప్పి వన్డేలపై దృష్టి పెట్టిన వాట్సన్‌పై సెలక్టర్లు అనూహ్యంగా వేటు వేశారు. అతడితో పాటు పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్, స్పిన్నర్ నాథన్ లియోన్‌కు కూడా చోటు దక్కలేదు. పేసర్లు జ్యోయెల్ పారిస్, స్కాట్ బోలండ్ తొలిసారిగా జట్టులోకి వచ్చారు.