జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న షేన్ వాట్సన్ సరికొత్త ఘనతను సాధించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో వాట్సన్ ఆడిన వేదికల పరంగా చూస్తే జైపూర్‌లోనే అత్యధిక పరుగుల్ని నమోదు చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.
రాజస్తాన్ రాయల్స్‌తో ఇక్కడ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో వాట్సన్(39) ఫర్వాలేదనిపించాడు. దాంతో జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వాట్సన్ 865 పరుగులు సాధించాడు. ఏ వేదిక పరంగా చూసినా వాట్సన్‌కు ఇదే అత్యుత్తమంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment