IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. మరి కొన్ని గంటల్లో బెంగళూరు వేదికగా మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఈ ఆటగాళ్లు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లని ఏ ఫ్రాంచైజీ కోనుగొలు చేస్తుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనడంతో వేలానికి సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రానున్న వేలంలో శ్రేయస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లలో ఎవరో ఒకరు రూ. 20 కోట్ల భారీ ధర దక్కించుకుంటారని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపటిల్స్ రీటైన్ చేసుకోలేదు. అదే విధంగా డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ రీటైన్ చేసుకోలేదు. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్ ,యుజ్వేంద్ర చాహల్ వంటి వారికి భారీ ధర దక్కనుందని వాట్సన్ భావిస్తున్నాడు.
డేవిడ్ వార్నర్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకోలేదు. దీంతో రానున్న వేలంలో అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడడం ఖాయం. ఐపీఎల్‌లో 41.59 బ్యాటింగ్ సగటుతో అద్భుతమైన రికార్డును వార్నర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా మంచి రికార్డులను కలిగి ఉన్నాడు. కాబట్టి ఐపీఎల్‌లో రూ. 20 కోట్ల మార్కును అధిగమించే తొలి వ్యక్తి కావచ్చు. కాగా ఈ వేలంలో వార్నర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కలిగి ఉన్నాడు.
మిచెల్ మార్ష్: ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు బిగ్ బ్యాష్ లీగ్‌లో బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. అయితే వేలంలో రూ. 20 కోట్లు పొదే అవకాశం ఉన్న రెండో ఆటగాడిగా మిచెల్ మార్ష్‌ను షేన్ వాట్సన్ ఎంపిక చేశాడు. వేలంలో అతడి పేరును 2 కోట్ల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకోలేదు. కాగా గతంలో ఢిల్లీకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండడంతో అతడికి భారీ ధర దక్కనుంది. రూ. 20 కోట్ల మార్కును అధిగమించే మూడు ఆటగాడిగా శ్రేయస్‌ను వాట్సన్ ఎంపిక చేశాడు.
On the eve of the IPL mega auction, here are 5 players that I feel are the top picks for any team. One former teammate is at the top of my list @MELbet_in @melbet_bangla pic.twitter.com/ZJJi6erp5r
— Shane Watson (@ShaneRWatson33) February 11, 2022
Comments
Please login to add a commentAdd a comment