షాహిద్ అఫ్రిది, యువరాజ్ సింగ్ (ఫైల్ ఫొటో)
చెన్నై : సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్‌లు యువరాజ్ సింగ్‌ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో పోల్చారు. ఐపీఎల్-11 విజేత చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన హర్భజన్ సింగ్(37), షేన్ వాట్సన్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణే అందుకు కారణం. 2001లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు నీ వయసెంత అని భజ్జీని అడగగా.. 18 అని వాట్సన్‌కు చెప్పాడు.
నేను అడిగింది నీ కెరీర్ వయసు కాదని, కేవలం నీ వయసు మాత్రమేనంటూ వాట్సన్ భజ్జీపై జోక్ పేల్చాడు. దీంతో భజ్జీ గట్టిగా నవ్వేశాడట. నువ్వు అఫ్రిది(38)తో క్రికెట్ ఆడావా.. అతడిని దగ్గరగా గమనించావా అని వాట్సన్‌ను అడిగాడు. కొన్నేళ్లుగా అఫ్రిదిని గమనిస్తున్నాను, గత ఏడేళ్లుగా అతడి వయసు 36 ఏళ్లు మాత్రమేనంటూ వాట్సన్ చమత్కరించాడు.
హర్భజన్ కథ...
నేను(హర్భజన్), యువరాజ్ సింగ్ చాలాకాలం కలిసి క్రికెట్ ఆడాం. అండర్-14, అండర్-16, అండర్-19 జట్లలో యువీతో కలిసి ఆడాను. కానీ నేను యువీ కంటే వృద్ధాప్యంలో ఉన్నానని కామెంట్ చేస్తున్నారు. అండర్-19 వరల్డ్‌కప్‌లో మా జట్టుపై యువీ 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడని, ఆపై ఛాంపియన్స్ ట్రోఫీలోనూ యువీ అద్భుతంగా ఆడాడని ఆసీస్ క్రికెటర్ వాట్సన్ గుర్తు చేశాడు. వెంటనే స్పందించిన భజ్జీ.. అయితే యువరాజ్ కూడా అఫ్రిది లాంటివాడేనంటూ గట్టిగా నవ్వేశాడు. కాగా, హర్భజన్, యువీలు ప్రస్తుతం జట్టులో చోటు కోసం యత్నిస్తున్నారు. వీరి సంభాషణపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment