
'ఆ ఘనత టీమ్ కు దక్కుతుంది'
ముంబై: తమ జట్టు ఆల్ రౌండ్ షో కారణంగానే కీలక మ్యాచ్ లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ అన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో 9 పరుగులతో విజయం సాధించి ప్లేఆప్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో వాట్సన్ సెంచరీ చేశాడు. 59 బంతుల్లో 104 పరుగులు బాదాడు.
చావేరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో విజయం సాధించామని వాట్సన్ పేర్కొన్నాడు. ఈ ఘనత టీమ్ కే దక్కుతుందన్నాడు. ధావల్ కులకర్ణి పట్టిన రెండు క్యాచ్ లు, క్రిస్ మోరిస్ తీసిన నాలుగు వికెట్లు ఎంతో కీలకమని చెప్పాడు. రహానే పట్టిన క్యాచ్ కూడా ముఖ్యమైనదే అన్నాడు. తాను ఫామ్ లోకి పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించడానికి తాను పడిన కష్టం ఫలించిందని చెప్పాడు.