షేన్ వాట్సన్ (ఫైల్ ఫొటో)
దుబాయ్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లపై విధించిన శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని ఆ జట్టు మాజీ ఆటగాడు, ఐపీఎల్ ఫైనల్ హీరో షేన్‌వాట్సన్ అభిప్రాపడ్డాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సూత్రదారైన డేవిడ్ వార్నర్, ఇది జట్టు వ్యూహమే అని తెలిపిన స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్‌కు 9 నెలలు, వార్నర్, స్మిత్‌లను ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ శిక్షలు ఖరారు చేసింది. అంతేకాకుండా వార్నర్ ఎప్పటికి కెప్టెన్ కాలేడని ప్రకటించింది. దీంతో స్మిత్, వార్నర్‌లు ఈ సీజన్ ఐపీఎల్‌కు సైతం దూరమయ్యారు.
దుబాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన వాట్సన్ బాల్‌ట్యాంపరింగ్ ఉదంతపై స్పందిస్తూ.. ‘‘గతంలో పలువురు ఆటగాళ్లకు విధించిన శిక్షలతో పోలిస్తే.. ఇవి చాలా దారుణమైన శిక్షలు. ఇప్పటికే వాళ్లు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్లు మళ్లి తిరిగొచ్చే సమయానికి మరింత దృఢంగా తయారవుతారు. వారు చేసిన తప్పులే వారిని అలా తయారు చేస్తాయి. వారు చేసింది పెద్ద నేరమే. కాదనడం లేదు. ఈ వివాదం నుంచి ఆస్ట్రేలియా జట్టు కోలుకునేలా చేసే సత్తా కొత్త కోచ్ జస్టిన్ లాంగర్‌కు ఉంది. అతనే సరైనవాడు.’ అని వాట్సన్ తెలిపాడు. ఐపీఎల్-11 సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ సెంచరీతో రాణించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ అందుకోవడం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శిక్షలు మరి ఎక్కువగా ఉన్నాయని గతంలో భారత క్రికెటర్లతో సహా ఆసీస్ మాజీ క్రికెటర్లు సైతం ఈ ఆటగాళ్లపై సానుభూతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment