
బై బై వాట్సన్
టి20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వాట్సన్ వీడ్కోలు
మొహాలీ: ఆస్ట్రేలియా క్రికెట్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ తర్వాత ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మేరకు ఐఎస్ బింద్రా స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న జట్టు సభ్యులకు వీడ్కోలు సందేశాన్ని ఇచ్చాడు. ఉద్వేగపూరితమైన మాటలతో సహచరులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న వాట్సన్ గత సెప్టెంబర్ నుంచి వన్డేలకూ దూరంగా ఉన్నాడు. 14 ఏళ్ల కిందట మార్చి 24న దక్షిణాఫ్రికాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన వాట్సన్ మళ్లీ సరిగ్గా అదే రోజున వీడ్కోలు విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
2005లో తొలి టెస్టు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 59 మ్యాచ్‌ల్లో 3731 పరుగులు; 75 వికెట్లు తీశాడు. 190 వన్డేల్లో 5757 పరుగులు; 168 వికెట్లు పడగొట్టాడు. 56 టి20ల్లో 1400 పరుగులు; 46 వికెట్లు తీశాడు. ఆరు టి20 ప్రపంచకప్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (2007, 2015) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా ఆడే ఈ ఆల్‌రౌండర్‌ను ఈసారి వేలంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ రూ. 9.5 కోట్లకు దక్కించుకుంది. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయని భావించా. గత వారం రోజులుగా దీని గురించే ఆలోచిస్తున్నా. బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి టి20 ప్రపంచకప్ తర్వాత గుడ్‌బై చెప్పాలని నిర్ణయానికి వచ్చా. ఆసీస్‌కు ఆడటం గౌరవంగా భావిస్తున్నా’ అని వాట్సన్ పేర్కొన్నాడు.