2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఏ సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉండబోతోందో ‘ముందస్తు’గా వెల్లడయ్యింది.
మనోజ్ తివారీ
ప్రస్తుత ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ సీటుపైనే ఎక్కువ చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో మనోజ్ తివారీ విజయం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి.
పవన్ సింగ్
భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ బీహార్‌లోని కరకట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై పోటీకి ఎన్డీఏ ఉపేంద్ర కుష్వాహను రంగంలోకి దింపింది. అయితే కరకట్ సీటు పవన్ సింగ్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
కంగనా రనౌత్
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి దింపింది. ఆమెతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తలపడ్డారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కంగనా రనౌత్ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిర్హువా
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి భోజ్‌పురి గాయకుడు, నటుడు నిర్హువాను బీజేపీ పోటీకి దింపింది. ఇదేస్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ బరిలోకి దిగారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో నిరాహువాదే పైచేయి అని వెల్లడయ్యింది.
హేమామాలిని
బాలీవుడ్ నటి హేమామాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్‌లో హేమ మాలినిదే పైచేయి అని వెల్లడయ్యింది.
రవి కిషన్
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రవికిషన్ పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం రవికిషన్ ఇక్కడి నుంచి సునాయాసంగా గెలుస్తారు. గోరఖ్‌పూర్ స్థానం బీజేపీకి కంచుకోట. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి నాథ్ ఆదిత్యనాథ్ స్వస్థలం.
Comments
Please login to add a commentAdd a comment