హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గుచూపాయి. రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యతను ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ మధ్య భారీ పోటీ ఏర్పడింది.
అయితే ఫలితాల్లో కంగనా రనౌత్ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి నుంచి పది మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ మండీ కిరీటం కంగనాకే దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కాంగ్రా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి రాజీవ్, కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రాలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఈ స్థానం నుంచి పది మంది అభ్యర్థులు పోటీకి దిగారు.
హమీర్‌పూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి సత్పాల్ సింగ్ రైజాదా మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అనురాగ్ ఠాకూర్ హమీర్‌పూర్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఈ స్థానంలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సిమ్లా లోక్‌సభ స్థానంలో బీజేపీ నుంచి సురేశ్ కుమార్, కాంగ్రెస్ నుంచి వినోద్ సుల్తాన్‌పురి తలపడ్డారు. ఈ స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ఈ నాలుగు స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment