బ్యాక్‌స్ట్రోక్ బాలుర విభాగంలో మనోజ్ విజేతగా నిలువగా, గుణ చక్రవర్తి కాంస్య పతకం గెలిచాడు.
బ్యాక్‌స్ట్రోక్ బాలుర విభాగంలో మనోజ్ విజేతగా నిలువగా, గుణ చక్రవర్తి కాంస్య పతకం గెలిచాడు. ఇదే ఈవెంట్ బాలికల కేటగిరీలో నివేదిత కూడా కాంస్యం గెలుపొందింది. గచ్చిబౌలీ స్విమ్మింగ్ పూల్‌లో శుక్రవారం జరిగిన 1500 మీ. ఫ్రీస్టయిల్ బాల, బాలికల విభాగాల్లో విక్రాంత్, శ్రేష్ట కాంస్యాలు సాధించారు. 200 మీ. ఫ్రీస్టయిల్ బాలుర విభాగంలో యశ్‌వర్మ రజతం, బాలికల కేటగిరీలో అనామిక కృష్ణన్ కాంస్యం నెగ్గారు.
ఇదే విభాగం గ్రూప్-2 బాల,బాలికల పోటీల్లో గురుచంద్ర, సాహితి రెడ్డిలు రజత పతకాలు గెలిచారు. 100 మీ. బ్యాక్‌స్ట్రోక్ బాలుర విభాగంలో సుశాంత్ రెండో స్థానంలో నిలిచాడు. గ్రూప్-2 ఈవెం ట్‌లో హరిబాబు కాంస్యం, బాలికల్లో నాగస్వప్న రజతం నెగ్గారు. 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ బాలుర విభాగంలో రుత్విక్, బాలికల ఈవెంట్‌లో ప్రణతి రజత పతకాలు గెలిచారు. 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ బాలుర పోటీలో భువన్ రావు రజతం నెగ్గగా, బాలికల విభాగంలో సాయి గ్రీష్మ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్ బాలుర గ్రూప్-2 విభాగంలో బి.వాసు, బాలికల ఈవెంట్‌లో స్నిగ్ధారెడ్డి రజత పతకాలు గెలిచారు. 50 మీ. బ్రెస్ట్ స్ట్రోక్ బాలుర గ్రూప్-3లో లోహిత్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు.