పట్నా: సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పారీ్టకి చెందిన ఎమ్మెల్యే మనోజ్ మంజిల్‌ను బిహార్ అసెంబ్లీ అనర్హుడిగా ప్రకటించింది. ఓ హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినందున, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధాన సభ సెక్రటేరియట్ తెలిపింది.
కోర్టు శిక్ష ప్రకటించిన ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. భోజ్‌పూర్ జిల్లా తరారీ స్థానం నుంచి మంజిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి హత్య కేసు విచారించిన ఎంపీ/ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు మంజిల్‌ను దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బిహార్ అసెంబ్లీలో వామపక్షాల బలం 11కు తగ్గినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment