భారీ స్కాంపై మంచు వారి సినిమా | Manchu Family Movie On Mira Road call center scam | Sakshi
Sakshi News home page

భారీ స్కాంపై మంచు వారి సినిమా

Published Thu, Mar 23 2017 2:03 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

భారీ స్కాంపై మంచు వారి సినిమా

భారీ స్కాంపై మంచు వారి సినిమా

వరుస ఫెయిల్యూర్స్ ఎదురవుతుండటంతో మంచు ఫ్యామిలీ హీరోలు కథల ఎంపికలో కొత్త దనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన మంచు ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం రియలిస్ట్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ స్కాం నేపధ్యంలో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మంచు ఫ్యామిలీ హీరోలు.

అమెరికా వాళ్లను మోసం చేసి కోట్ల కొద్ది డబ్బును వేనకేసుకున్న మీరా రోడ్ కాల్ సెంటర్ స్కాంను సినిమాగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించిన పూర్తి స్థాయి విషయాలు తెలుసుకునేందుకు మంచు టీం థానే పోలీసులను సంప్రదించింది. అయితే ఈ విషయంలో మంచు ఫ్యామిలీ నుంచి తెలుగు మీడియాకు సమాచారం అందకపోయినా బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement