'అక్కతో పాటు మేనకోడలికి గిప్ట్' | manchu family rakhi celebrations | Sakshi
Sakshi News home page

'అక్కతో పాటు మేనకోడలికి గిప్ట్'

Published Sat, Aug 29 2015 1:40 PM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

'అక్కతో పాటు మేనకోడలికి గిప్ట్'

'అక్కతో పాటు మేనకోడలికి గిప్ట్'

మంచు వారి ఫ్యామిలీలో రాఖీ పండుగ సందర్భంగా ఈసారి లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె కూతురు విద్యా నిర్వాణకు కూడా బహుమతులు రెడీ అవుతున్నాయట. తమ ఇంట్లో జరిగే రాఖీ వేడుకల విశేషాలను హీరో మంచు విష్ణు తెలిపాడు.  మామూలుగానే లక్ష్మి మా నుంచి గిప్ట్లు డిమాండ్ చేస్తుంది. ఇక రాఖీ పండుగకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ కట్టి రూ.3 లక్షలు డిమాండ్ వసూలు చేసింది. దాంతో ఆమె తనకు కాల్సినవి కొనుక్కుంది. ఒకవేళ మనోజ్ ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉంటే, అతని  కోటా కూడా నా నుంచే వసూలు చేస్తుంది అని విష్ణు మురిపెంగా చెప్పటం విశేషం.

చిన్నతనం నుంచి అక్కతో రాఖీ కట్టించుకునే అలవాటు ఉందన్న విష్ణు అప్పట్లో అక్క ఏ బహుమతి అడిగితే అది కొనిచ్చేవాళ్లమన్నాడు. అంతే కాదు చిన్నతనంలో తాను అడిగింది కొనివ్వకపోతే తమ మీద నాన్నకు ఫిర్యాదు చేసేదని అతడు చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

అయితే పెద్దయ్యాక మాత్రం అక్కకు బ్లాక్ చెక్ ఇచ్చే వాళ్లమని, ఈ ఏడాది మాత్రం ఒకటి కాదు రెండు బహుమతులు ఇస్తున్నట్లు చెప్పాడు.. లక్ష్మీతో పాటు మేనకోడలు విద్యా నిర్వాణకు కూడా స్పెషల్ గిప్ట్ ప్రజెంట్ చేస్తున్నట్లు చెప్పాడీ యంగ్ డైనమైట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement