కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవనే దీనికి కారణం. ఈ వివాదంలో బోలెడన్ని టర్న్స్, ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తండ్రి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే రూమర్స్, పరస్పరం పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకోవడం.. మధ్యలో ఊహించని విధంగా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి, ఆపై పోలీసు కేసు.. ఇది కాదన్నట్లు అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరి, కొన్నిరోజులకు డిశ్చార్జ్ కావడం.. ఇలా ఒకటేమిటి ఇండస్ట్రీ మొత్తం ఈ వివాదం గురించే చర్చించుకున్నారు. ప్రస్తుతానికి ఇది కాస్త సద్దుమణిగినట్లే అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)
జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు ఓవైపు నడుస్తోంది. మరోవైపు తన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్స్‌ని గూగూల్, సోషల్ మీడియాలో ఉపయోగించద్దని ఢిల్లీ హైకోర్ట్‌లో ఈయన పిటిషన్ వేశారు. దీనికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. మోహన్ బాబు కంటెంట్‌ని గూగుల్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో మంచు ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్.. గూగుల్ నుంచి డిలీట్ అవుతాయి.
(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో)
Comments
Please login to add a commentAdd a comment