
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్, సమర్థవంతమైన మోటార్ల తయారీలో ఉన్న ముంబై కంపెనీ ఆటంబర్గ్ టెక్నాలజీస్ ప్రీమియం ఫ్యాన్ల మార్కెట్లో పోటీపడుతోంది. వచ్చే రెండేళ్లలో ప్రీమియం విభాగంలో 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ కో–ఫౌండర్ మనోజ్ మీన సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘బీఎల్‌డీసీ టెక్నాలజీతో రూపొందిన కంపెనీ ఫ్యాన్లు 65 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తాయి. ఖరీదు రూ.3,000 ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఫ్యాన్ల విపణి 6 శాతం వార్షిక వృద్ధితో రూ.10,000 కోట్లుంది. ఇందులో ప్రీమియం విభాగం వాటా 15 శాతం కాగా, వృద్ధి ఏకంగా 20 శాతముంది. గృహోపకరణాల్లో వాడేందుకు వీలుగా సమర్థవంతమైన మోటార్లకై గోద్రెజ్, వోల్టాస్‌లు మా కంపెనీతో చర్చిస్తున్నాయి. వచ్చే ఏడాది మిక్సర్ గ్రైండర్‌ను ప్రవేశపెట్టనున్నాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment