అందుకేమో ఆనందం... ఇందుకేమో బాధ! | Rakul started working in Manoj's film | Sakshi
Sakshi News home page

అందుకేమో ఆనందం... ఇందుకేమో బాధ!

Published Sun, May 4 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

అందుకేమో ఆనందం... ఇందుకేమో బాధ!

అందుకేమో ఆనందం... ఇందుకేమో బాధ!

 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అనే ఒక్క విజయంతో రకుల్ ప్రీత్‌సింగ్ ఖాతాలో రెండు తెలుగు సినిమాలొచ్చిపడ్డాయి. గోపిచంద్‌తో ఓ సినిమా, మనోజ్‌తో ఓ సినిమా ఇక్కడ చేస్తూ... మరో వైపు బాలీవుడ్‌లో ఓ సినిమా, కోలీవుడ్‌లో ఓ సినిమాతో బిజీ బిజీగా ఉంది రకుల్ కెరీర్. ఒక్కసారిగా తన కెరీర్‌లో వచ్చిన ఈ మార్పు చూసి తెగ సంబరపడిపోతోంది తను. ఈ విషయం గురించి  మాట్లాడుతూ- ‘‘విజయం జీవితంలో ఎంత మార్పు తెస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాను. సక్సెస్ అనేది ఆనందంతో పాటు బరువు, బాధ్యతల్ని కూడా పెంచుతుంది.
 
 ఎవరి మనసుల్ని నొప్పించకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఇప్పుడు నాకు ఎంతైనా ఉంది. అందుకే కెరీర్‌ని ఓ ప్లానింగ్ ప్రకారం మలచుకుంటున్నాను. రాత్రింబవళ్లూ మూడు షిఫ్ట్‌లు షూటింగుల్లో పాల్గొంటున్నాను. బిజీ అవ్వడం ఆనందంగా ఉంది కానీ, కనీసం కాసేపు విశ్రాంతి తీసుకునే టైమ్ కూడా దొరక్కపోవడం కాస్త బాధగానే ఉంది. ఇటీవల రాత్రి వేళల్లో కూడా షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ప్రస్తుతం నేను చేసే సినిమాలన్నీ నాకు మంచి పేరు తెచ్చేవే’’ అని ఆనందం వెలిబుచ్చారు రకుల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement