కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా? | Adipurush Writer Manoj Muntashir New Benz Car Cost Details | Sakshi
Sakshi News home page

Manoj Muntashir: అత్యంత ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'ఆదిపురుష్' రైటర్

Published Tue, Mar 5 2024 2:36 PM | Last Updated on Tue, Mar 5 2024 3:18 PM

Adipurush Writer Manoj Muntashir New Benz Car Cost Details - Sakshi

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా గురించి చెప్పగానే చాలామంది ఫ్యాన్స్ భయపడిపోతారు. ఎందుకంటే రామాయణం పేరు చెప్పి విచిత్రమైన సీన్స్ అన్నీ తీశారు. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలానే ఇదే సినిమాకు రచయితగా చేసిన మనోజ్ ముంతాషిర్ అనే వ్యక్తిపై కూడా అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి సదరు మనోజ్ వార్తల్లో నిలిచాడు. ఎందుకో తెలుసా?

(ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్)

బాలీవుడ్‌లోని టాప్ రైటర్స్‪‌లో మనోజ్ ముంతాషిర్ ఒకరు. 'తేరే మిట్టి', 'గల్లియన్', 'కౌన్ తుజే' లాంటి కల్ట్ సాంగ్స్ రాసింది ఈయనే. అలానే 'బాహుబలి' హిందీ వెర్షన్ కోసం కూడా ఈయన పనిచేశారు. కానీ ఎప్పుడైతే 'ఆదిపురుష్' సినిమాలో హనుమంతుడి పాత్రకు వింత డైలాగ్స్ రాశారో.. ప్రేక్షకులు ఈయన్ని ఓ రేంజులో ఆడుకున్నారు. అప్పట్లో కొన్ని నెలల పాటు ఈయనపై ట్రోలింగ్ జరిగింది. దీంతో జనాలు ఈయన్ని దాదాపుగా మార్చిపోయారు.

అలాంటిది రైటర్ మనోజ్ ముంతాషిర్.. తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.71 కోట్లు వరకు ఉంటుందని టాక్. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన కారు అనుకోవచ్చు. బాలీవుడ్‌లో అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా లాంటి టాప్ స్టార్స్ మాత్రమే ఈ కారుని ఉపయోగిస్తున్నారు. అలాంటిది రైటర్ మనోజ్ దీన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement