
చిత్తూరు : తిరుచానూరు అమ్మవారి ఆలయం ముందు బెంగళూరుకు చెందిన మనోజ్ శుక్రవారం రాత్రి సబీ అనే హిజ్రాను వివాహం చేసుకున్నాడు. ఆలయం ముందు వివాహ తంతు జరుగుతుంటే స్థానికులు, భక్తులు ఆశ్చర్యపోయి చూశారు. హిజ్రాలే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
అవును..వాళిద్దరూ ఒకటయ్యారు...
మరోవైపు ఓ హిజ్రాను మరో హిజ్రా పెళ్లాడిన సంఘటన తిరుపతిలోని దామినేడులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఇందిరమ్మ గృహాల్లో నివసిస్తున్న హిజ్రాలలో ఓ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇదేంటి ఒక హిజ్రా, ఇంకో హిజ్రాను పెళ్ళి చేసుకోవటం ఇదేమి విచిత్రం అనుకున్నా సరే వారిద్దరూ పెళ్ళి అనే బంధంతో ఒకటయ్యారు. కేవలం దాంపత్య సుఖం మాత్రమే కాదని, ఒకరికి ఒకరు కష్టాల్లో, సుఖాల్లో తోడు నీడగా ఉండాలని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment