ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘14డేస్ లవ్’ | 14 Days Love Movie Release Date Out | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘14డేస్ లవ్’

Published Wed, Feb 21 2024 5:54 PM | Last Updated on Wed, Feb 21 2024 5:54 PM

14 Days Love Movie Release Date Out - Sakshi

మనోజ్ పుట్టూర్, చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ‘14 డేస్‌ లవ్‌’. నాగరాజు బోడెం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హరిబాబు దాసరి నిర్మిస్తున్నారు. రాజా రవీంద్ర, సనా సునూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

‘కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో ఈ సినిమా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా   దర్శకుడు నాగరాజు బోడెం  ఈ చిత్రాన్ని తీర్చి దిద్డాడు’ అని నిర్మాతలు పేర్కొన్నారు. అంజలి, ఐడ్రీమ్ రాజా శ్రీధర్ నటించిన ఈ చిత్రానికి కిరణ్‌ వెన్న పాటలు.. యష్‌కే బాజి బీజీఎం అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement