సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు ఉన్నాయి. మనోజ్‌కు స్మిత ఫేస్‌బుక్ ద్వారా పరిచయం కాగా.. స్మితతో కలిసి డిఫ్రెషన్ కౌన్సిలింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెతో మనోజ్ సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇక, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. 2003లో స్మితతో సిద్ధార్థ్ దాస్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమారుడు-17ఏళ్లు, కుమార్తె-13ఏళ్లు) ఉన్నారు. గతంలో వీరిద్దరూ మూసాపేటలో ఉండేవారు. ఇక, 2018లో సిద్ధార్ధ్‌పై స్మిత గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విడాకులకు అప్లయ్ చేసింది. అప్పటి నుండి భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.
మరోవైపు.. తమను మనోజ్ హింసిస్తున్నట్లుగా స్మిత కొడుకు CWCకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి సిద్ధార్థ్ దాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30గంటలకి సెలెబ్రిటీ విల్లా వెళ్లారు. సిద్ధార్ధ్‌ను చూడగానే మనోజ్‌ని స్మిత పిలిచారు. ఆవేశంలో ఫ్రెండ్ గిప్ట్‌గా ఇచ్చిన ఏయిర్ గన్‌తో సిద్ధార్థ్‌పై మనోజ్ కాల్పులు జరిపాడు. కాగా, సిద్ధార్ధ్ తప్పించుకుని పారిపోయాడు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్మితతో తన బంధానికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్‌ను చంపేయాలనుకుని మనోజ్ అనుకున్నాడు. మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్..
Comments
Please login to add a commentAdd a comment