కరెన్సీ నోట్లు లెక్కపెట్టడంలో వరుడు విఫలం కావడంతో ఓ వధువు అతడితో పెళ్లిని తిరస్కరించింది.
బలియా: కరెన్సీ నోట్లు లెక్కపెట్టడంలో వరుడు విఫలం కావడంతో ఓ వధువు అతడితో పెళ్లిని తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో శుక్రవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. యూపీకి చెందిన మనోజ్, బిహార్‌కు చెందిన ఓ అమ్మాయికి పెళ్లి ఖాయం అయింది. వరుడు మనోజ్ గ్రామంలో శుక్రవారం పెళ్లి ముహూర్తం. అయితే, పెళ్లి జరుగుతుండగా వ్యవహరిస్తున్న తీరును చూస్తే.. వరుడు నిరక్షరాస్యుడేమోనని, మగపెళ్లి వారు ఆ విషయం దాచిపెట్టారేమోనని గ్రాడ్యుయేట్ అయిన వధువుకు అనుమానం వచ్చింది. దీంతో అతడికి కరెన్సీ నోట్లు ఇచ్చి లెక్కపెట్టమని పందిట్లోనే పరీక్ష పెట్టింది. నోట్లు లెక్కపెట్టలేక తెల్లమొహం వేయడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది.