
లక్డీకాపూల్: ఉద్యోగులకు మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సీపీయస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం వారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సీపీయస్ కోశాధికారి నరేష్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమూర్తి, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, కూరకుల శ్రీనివాస్, దర్శన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లికార్జున్, సాహిత్య కార్యదర్శి రోషన్, జాయింట్ సెక్రటరీ ఉపేందర్, హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ రావులు పాల్గొన్నారు.
యథావిధిగా ఓయూ పీజీ, డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో జరిగే వివిధ కోర్సుల పరీక్షలు య«థావిధిగా కొనసాగుతాయని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ మంగళవారం తెలిపారు. రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ఓయూ పీజీ,డిగ్రీ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షలను యథావిధంగా కొనసాగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment