‘చూసీ చూడంగానే’ కనెక్ట్‌ అవుతున్నారు | Choosi Choodangaane Telugu Movie Unit Thanks Meet | Sakshi
Sakshi News home page

‘చూసీ చూడంగానే’ కనెక్ట్‌ అవుతున్నారు

Published Sat, Feb 1 2020 7:37 PM | Last Updated on Sat, Feb 1 2020 7:40 PM

Choosi Choodangaane Telugu Movie Unit Thanks Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘చూసీ చూడంగానే’ సినిమాకు సానుకూల స్పందన రావడం పట్ల చిత్రయూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది. జనవరి 31న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో థాంక్స్ మీట్‌ను నిర్వ‌హించింది చిత్ర యూనిట్.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సినిమా తీసినా ఓ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము  అనుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ప్రేక్ష‌కుల‌కి కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేష సింధు ది బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా క‌ష్ట‌ప‌డి బాగా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ బాగా పండింది. హీరోయిన్‌గా తెలుగులో వ‌ర్ష బొల్లమ్మకిది మంచి లాంచ్ అవుతుంది. మాళవిక త‌న పెర్‌ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. మా అబ్బాయి శివ‌కు మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూ అంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే  సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు' అన్నారు.

ద‌ర్శ‌కురాలు శేష సింధు మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన వాళ్ళంద‌రూ చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు వ‌ర్ష‌, మాళ‌విక కి ఈ సినిమా ద్వారా  మంచి పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంది.  ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు’ అన్నారు.

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘చాలా సహజంగా సినిమాను తీయాలనుకున్నాం. అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. యువతతో పాటు అన్ని వర్గాలకు మా సినిమా కనెక్ట్ అవుతుంది. నాకిది తొలి చిత్రం అయినా బాగా చేశానని అంటుంటే సంతోషంగా ఉంది. న‌టుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా పండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రయత్నించారు. దాని వల్లే ఆడియ‌న్స్‌కి  ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఓ హీరోగా మొదటి సినిమాకి ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ ఆశించ‌లేదు’ అన్నారు. మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు. ఈ కార్యక్రమంలో న‌టుడు వెంకటేష్, రైట‌ర్ పద్మ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.

చదవండి: ‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement