Choosi Choodangaane Movie
-
‘చూసీ చూడంగానే’ కనెక్ట్ అవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘చూసీ చూడంగానే’ సినిమాకు సానుకూల స్పందన రావడం పట్ల చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. జనవరి 31న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో థాంక్స్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు సినిమా తీసినా ఓ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము అనుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేష సింధు ది బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టపడి బాగా చేశారు. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ బాగా పండింది. హీరోయిన్గా తెలుగులో వర్ష బొల్లమ్మకిది మంచి లాంచ్ అవుతుంది. మాళవిక తన పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. మా అబ్బాయి శివకు మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూ అంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు' అన్నారు. దర్శకురాలు శేష సింధు మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు వర్ష, మాళవిక కి ఈ సినిమా ద్వారా మంచి పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘చాలా సహజంగా సినిమాను తీయాలనుకున్నాం. అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. యువతతో పాటు అన్ని వర్గాలకు మా సినిమా కనెక్ట్ అవుతుంది. నాకిది తొలి చిత్రం అయినా బాగా చేశానని అంటుంటే సంతోషంగా ఉంది. నటుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా పండింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రయత్నించారు. దాని వల్లే ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. ఓ హీరోగా మొదటి సినిమాకి ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ ఆశించలేదు’ అన్నారు. మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు వెంకటేష్, రైటర్ పద్మ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. చదవండి: ‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ -
‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ
చిత్రం : చూసీ చూడంగానే జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీశన్, పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా, వెంకటేశ్ కాకుమాను సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : శేష సింధు రావు నిర్మాత : రాజ్ కందుకూరి బ్యానర్ : ధర్మపథ క్రియేషన్స్ పెళ్లి చూపులు, మెంటల్ మదిలో వంటి హిట్ చిత్రాలు అందించిన నిర్మాత రాజ్ కందుకూరి. తన సినిమాల్లో చాలా వరకు కొత్త నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అవకాశం కల్పించే రాజ్.. తన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘చూసీ చూడంగానే’. అలాగే ఈ చిత్రంతో శేష సింధు రావును దర్శకురాలిగా పరిచయం చేశారు. తమిళ చిత్రం 96లో ప్రభ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న వర్ష బొల్లమ్మ ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమాలకు విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించే రాజ్.. ఇది తన కుమారుడి తొలి సినిమా కావడంతో చిత్ర ప్రమోషన్స్‌ను భారీగానే చేశాడు. అలాగే సురేష్ ప్రొడక్షన్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సాంగ్స్, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టునేలా చేశారు. మరి తన కుమారుడిని హీరోగా ఎస్టాబ్లిష్ చేయడంలో రాజ్ కందుకూరి సక్సెస్ అయ్యాడో లేదో రివ్యూలో చూద్దాం. కథ : సిద్దు (శివ కందుకూరి) తల్లిదండ్రుల బలవంతం మేరకు ఇంజనీరింగ్‌లో అడుగుపెడతాడు. అక్కడ ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఈయర్ వచ్చేసరికి ఐశ్వర్య సిద్దును వదిలి వెళ్లిపోతుంది. అయితే ఆ డ్రిపెషన్‌లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయని సిద్దు.. ఫ్యాషన్ పొటోగ్రాఫర్ అవుదామనుకుంటాడు. కానీ మూడేళ్ల తర్వాత వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్ అవుతాడు. అలా ఓ పెళ్లిలో శృతిని (వర్ష) చూసి లవ్‌లో పడతాడు. శృతికి, సిద్దు వారి కామన్ ఫ్రెండ్ యోగి ద్వారా కలుస్తారు. వారిద్దరరు ఫ్రెండ్స్ అవుతుండగా.. స్టోరిలో చిన్నపాటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. సిద్దును శృతి ఇంజనీరింగ్‌లో లవ్ చేసిందని.. ఇప్పటికి అతన్నే ఇష్టపడుతుందని తెలుస్తుంది. అయితే సిద్దు తన ప్రేమ విషయాన్ని చెప్పేలోగానే.. శృతి బాయ్‌ఫ్రెండ్ విరాట్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అందుకు శృతి కూడా ఓకే చెపుతుంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా? లేక విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమా అయినప్పటికీ శివ కందుకూరి తన నటనతో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్ వర్ష.. శృతి పాత్రకు సరిగా సరిపోయింది. కళ్లతో మంచి ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ.. సినిమాకు మంచి ఆకర్షణగా నిలిచింది. మరో హీరోయిన్ ఐశ్వర్య తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. శివ తల్లిదండ్రుల పాత్రలో నటించిన పవిత్ర లోకేష్, అనిష్ కురివిల్లా తమ పాత్రల మేరకు నటించారు. శృతి తండ్రి పాత్రలో కనిపించిన గురురాజ్ మానేపల్లి పాత్రకు అంత ప్రాధాన్యత లభించలేదు. శివ ఫ్రెండ్ యోగి పాత్రలో నటించిన వెంకటేశ్ కాకుమాను తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. విశ్లేషణ : ప్రేమ కథలు ఎప్పడైనా స్ర్కీన్‌పై ఎంత బాగా ప్రజెంట్ చేశామనేదే ముఖ్యం. అయితే ఈ కథలో కొద్దిగా కొత్తదనం ఉన్నప్పటికీ.. నూతన దర్శకురాలు శేష సింధు దానిని తెరపై అందంగా చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఫస్టాప్ మొత్తం సాగదీతగా అనిపిస్తోంది. సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథతో పాటు వచ్చే కామెడీ మెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకునేలా అనిపించదు. మరోవైపు గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్ సాంగ్స్‌లో గోపి తన మార్కు చాటుకున్నాడు. నిర్మాత రాజ్ కుందుకూరి నిర్మాణ విలువలు సినిమాకు భారీ లుక్‌ను తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హీరోగా తన కుమారుడిని ప్రొజెక్టు చేయడంలో రాజ్ కుందుకూరి కొద్దివరకు సఫలం అయ్యాడనే చెప్పాలి. ప్లస్ పాయింట్స్ : హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటన గోపి సుందర్ మ్యూజిక్ సెకాండఫ్‌లో కొన్ని సీన్లు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ సాగదీత సన్నివేశాలు తెరపై కథను బాగా ప్రజెంట్ చేయకపోవడం -సుమంత్ కనుకుల, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే!
‘‘హీరోయిన్గా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసినప్పుడే నటిగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండగలమని నా అభిప్రాయం. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉంటే డీ–గ్లామరస్ రోల్ చేస్తాను. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నా. నటిగా నాకు ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తాను’’ అన్నారు వర్ష బొల్లమ్మ. శేష సింధు దర్శకత్వంలో శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ అతని తండ్రి రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వర్ష చెప్పిన విశేషాలు. ► మైక్రోబయాలజీ చదివాను. నాకు చిన్నప్పట్నుంచే నటన అంటే చాలా ఇష్టం. కాలేజీలో స్టేజ్‌పై యాక్టర్‌గా చేయాలనుకున్నాను. కానీ మా కాలేజీ డ్రామా అసోసియేషన్‌వారు నన్ను సెలక్ట్ చేయలేదు. తొలిసారి తమిళంలో ‘వెట్రివేలన్’ అనే సినిమా చేశాను. ఆ తర్వాత తమిళ హిట్ ‘96’లో నటించాను. మలయాళంలో కూడా సినిమాలు చేశాను. ‘96’లో నా నటనను చూసి శేష సింధు, రాజ్ కందుకూరి నాకు ‘చూసీ చూడంగానే’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ► ఈ చిత్రంలో డ్రమ్మర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో నటించాను. కథ విన్నప్పుడు నా పాత్ర డ్రమ్మర్ అని చెప్పగానే నేను చేయగలనా? అని కొంచెం భయపడ్డాను. డ్రమ్మింగ్ గురించి అసలు ఏం తెలియకుండా చేయడం చాలా కష్టం. ఓ డ్రమ్ బ్యాండ్ నుంచి డ్రమ్మర్‌కి కావాల్సిన బేసిక్స్ నేర్చుకున్నాను. ► మహిళా దర్శకులు ఉన్న సినిమాల్లో హీరోయిన్గా చేయడం కొంతవరకు ప్లస్ కావొచ్చు. కానీ శేష సెట్లో టామ్‌బాయ్‌లా ఉండేవారు. ఇది ముక్కోణపు ప్రేమకథే. కానీ కాస్త విభిన్నంగా ఉంటుంది. మా చిత్రంలో ఉన్న కొత్తదనం ఏంటో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ► కథలో నా పాత్ర బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తాను. విజయ్ ‘బిగిల్’ సినిమాలో గాయత్రి పాత్ర చేసినప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. ‘96’ చేసిన తర్వాత ‘జాను’ (తమిళ చిత్రం ‘96’ తెలుగు రీమేక్) లో నటించే అవకాశం వచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయిగా నటిస్తున్నాను. -
‘చూసీ చూడంగానే` ప్రీ రిలీజ్ వేడుక
-
లిప్‌లాక్‌లు సక్సెస్ ఇవ్వవు
‘‘పెళ్లి చూపులు, మెంటల్ మదిలో’ సినిమాల తర్వాత వెంటనే సినిమా ఎందుకు చేయలేదని చాలా మంది అడిగారు. వరుసగా సినిమాలు చేసేయాలని అనుకోవడం లేదు. సినిమాల సంఖ్య కంటే క్వాలిటీ ముఖ్యం అని నమ్ముతాను’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. తన కుమారుడు శివ కందుకూరిని పరిచయం చేస్తూ రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి చెప్పిన విశేషాలు. ► మన దగ్గర లేడీ డైరెక్టర్స్ సంఖ్య చాలా తక్కువ. లేడీ డైరెక్టర్ని పరిచయం చేయాలనుకున్నాను. శేష సింధు చెప్పిన కథ నచ్చింది. కానీ నిన్ను నమ్మి సినిమా ఎలా ఇవ్వాలని అడిగాను. ఐదు నిమిషాల వీడియో షూట్ చేసి చూపించింది. నమ్మకం వచ్చింది. ► ఈ సినిమాకు కొత్తవాళ్లే కావాలని అడిగింది సింధు. చాలా మందిని ఆడిషన్ చేసింది. అప్పుడే మా అబ్బాయి ఇండియా వచ్చాడు. తనని సుమారు 12 రోజులు ఆడిషన్ చేసి హీరోగా తీసుకుంది. మా అబ్బాయి సినిమా అని స్పెషల్‌గా ఏం చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాం. ఈ సినిమా పూర్తికాకముందే మా అబ్బాయికి 3 సినిమా అవకాశాలు వచ్చాయి. రెండో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ► మా బ్యానర్లో వచ్చే సినిమాల్లో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు బలంగా ఉండాలనుకుంటాను. ఈ సినిమా నిడివి గంటా 54 నిమిషాలే. నిర్మాతగా మంచి సినిమానే తీశాను అనుకుంటున్నాను. నేను అనుకున్నదానికంటే బాగా చేశాడు మా అబ్బాయి శివ. ► సరైన సినిమా తీయడానికి 50 కోట్లు అక్కర్లేదు. 3 కోట్లు చాలు. 50 కోట్ల సినిమా తీయడం కంటే చిన్న బడ్జెట్ సినిమాలు తీయడమే ఎక్కువ రిస్క్. ఆ రిస్క్ అంటే నాకు ఇష్టం. ఈ మధ్య లిప్‌లాక్స్ సన్నివేశాలు ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు. లిప్‌లాక్ çసన్నివేశాలు సక్సెస్ ఇవ్వవు. -
2020 శివది కావాలని కోరుకుంటున్నా
‘‘ఒక చిన్న సినిమా విడుదలకి ముందే అన్ని పాటలు శ్రోతలను ఆకట్టుకోవడం నిజంగా అదృష్టం. శివ పరిచయం కాబోతున్న సినిమా అంటే మా అందరికీ సెలబ్రేషన్ మూమెంట్’’ అన్నారు దర్శక–నిర్మాత మధుర శ్రీధర్. ‘పెళ్లి చూపులు, మెంటల్ మదిలో’ చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవిక కథానాయికలు. సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదలైన పాటలకు 25 మిలియన్ల వ్యూస్ రావడంతో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించింది చిత్రబృందం. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంగీత దర్శకుడు, రచయితలందరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అయి 2020 మా శివదే కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘సినిమా మొదలయినప్పటి నుంచి అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. నా సినిమాలో పాటలన్నీ బావుండాలని పెద్ద రచయితలతోనే రాయించుకున్నాం. శివ బాగా యాక్ట్ చేశాడు’’ అన్నారు శేష సింధు. ‘‘మంచి స్క్రిప్ట్‌తో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న మా నాన్నగారికి, మా డైరెక్టర్ సింధుగారికి ధన్యవాదాలు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘సున్నితమైన భావోద్వేగాలతో శేష సింధుగారు బాగా చిత్రీకరించారు. సినిమాకు మంచి సంగీతం కుదిరింది’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్. -
సహజత్వానికి దగ్గరగా చూసీ చూడంగానే
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన తొలి చిత్రం ‘చూసీ చూడంగానే’. వర్ష, మాళవిక కథానాయికలుగా నటించారు. శేష సింధు రావు ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘ప్రతిభావంతులైన యువకులతో సినిమాలు చేయడానికే నేను ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ఈ సినిమా కథకు మా అబ్బాయి శివ హీరో అయితే బాగుంటుందని దర్శకురాలు శేష చెప్పడంతో శివను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాను. ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘నాపై నమ్మకం ఉంచి నన్ను హీరోను చేసిన మా నాన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. కథ బాగా నచ్చింది. నా కోసం మంచి స్క్రిప్ట్ రాసిన శేషగారికి థ్యాంక్స్. యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా సినిమాను విడుదల చేస్తోన్న నిర్మాత డి.సురేష్‌బాబుగారికి థ్యాంక్స్’’ అన్నారు శివ. ‘‘శివ బాగా నటించడానికి ఆస్కారం ఉన్న పాత్ర ఇది. హీరోయిన్ వర్ష బాగా నటించింది. షూటింగ్ పూర్తయ్యేలోపు వర్ష తెలుగు నేర్చుకుంది. మంచి డైలాగ్స్ రాసిన పద్మతో పాటు సహకరించిన నటీనటులు, చిత్రబందానికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు శేష. ‘‘చిన్న సినిమాలను రాజ్ కందుకూరిగారు ఎక్కువగా ప్రోత్సహిస్తుంటారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ సాధించాలి. హీరోగా పరిచయం అవుతున్న శివకు ఇది సరైన సబ్జెక్ట్’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఇది నా తొలి తెలుగు సినిమా. శివ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు వర్ష. ‘‘ఈ మూవీ నా కెరీర్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు మాళవిక. -
రాజ్ కందుకూరి తనయుడు హీరోగా ‘చూసీ చూడంగానే’
‘పెళ్ళిచూపులు’, ‘మెంటల్ మదిలో’ వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకోవడమే కాదు.. జాతీయ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఇప్పుడు రాజ్ కందుకూరి నిర్మాతగా, ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా నటిస్తోన్న తొలి చిత్రానికి ‘చూసీ చూడంగానే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు అనే మహిళా దర్శకురాలిని పరిచయం చేస్తున్నారు రాజ్ కందుకూరి. ఈమె క్రిష్ జాగర్లమూడి, సుకుమార్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజ్ కందుకూరి గత చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అసోసియేషన్‌లో విడుదలవుతుంది. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రంలో వర్ష హీరోయిన్గా నటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ‘మెంటల్ మదిలో’ కెమెరామేన్ వేద రామన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శివ కందుకూరి మరో మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.