వారి ఉత్సాహంతో కడుపు నిండిపోయింది | Actor Nani And Mrunal Thakur Starrer Hi Nanna Movie Release On December 7th, Deets Inside - Sakshi
Sakshi News home page

Hi Nanna Release Date: వారి ఉత్సాహంతో కడుపు నిండిపోయింది

Published Mon, Dec 4 2023 12:20 AM | Last Updated on Mon, Dec 4 2023 12:21 PM

Hi Nanna release on December 7th - Sakshi

శౌర్యువ్, హేషమ్, నాని, మృణాల్‌ ఠాకూర్, ప్రియదర్శి

‘‘హాయ్‌ నాన్న’ మ్యూజికల్‌ నైట్‌లో ఇంత హాయిగా గడపటం చాలా ఆనందాన్నిచ్చింది. అభిమానులు ఇచ్చిన ఉత్సాహం చూస్తుంటే కడుపు నిండిపోయింది. నా ప్రతి సినిమాకి ఇలాంటి వేడుక ఒకటి ఉండేలా చూస్తాను. ‘హాయ్‌ నాన్న’ కోసంప్రాంణం పెట్టి సొంత సినిమాలా పని చేసిన యూనిట్‌కి ధన్యవాదాలు’’ అని హీరో నాని అన్నారు.

శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా, శ్రుతీహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హాయ్‌ నాన్న మ్యూజికల్‌ నైట్‌’ వేడుకలో నాని మాట్లాడుతూ–‘‘ఈ చిత్రానికి హేషమ్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు.

శౌర్యువ్‌కి చాలా ప్రత్యేకమైన సినిమాగా ఇది నిలిచిపోతుంది. ‘హాయ్‌ నాన్న’ లాంటి అందమైన కథలు పెద్ద  బ్లాక్‌ బస్టర్స్‌ కావాలి’’ అన్నారు.‘‘సీతారామం’ తర్వాత నేను చేసిన చిత్రాల్లో నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం ‘హాయ్‌ నాన్న’’ అన్నారు మృణాల్‌ ఠాకూర్‌. ‘‘మా సినిమాకి సెన్సార్‌ బోర్డ్‌ క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శౌర్యువ్‌. ఈ వేడుకలో హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్, నటులు ప్రియదర్శి, విరాజ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement