నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ "హాయ్ నాన్న". అంతర్జాతీయంగా "హాయ్ డాడ్"గా విడుదలైన ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన "హాయ్ నాన్న" కథనం, నటీనటుల పర్ఫామెన్స్ న్యాయనిర్ణేతలను ఆకర్షించింది.
శౌర్యువ్ మాట్లాడుతూ.. 'ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో లభించిన ఈ గుర్తింపు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యిందీ మూవీ. 'హాయ్ నాన్న'కి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, 'హాయ్ నాన్నా'కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను"అన్నారు.
Hi Nanna celebrations continue across all corners! 💥💥#HiNanna released as #HiDad and received the prestigious award for Best Feature Film at the esteemed Athens International Art Film Festival in their March 2024 edition ❤️🔥
— Vyra Entertainments (@VyraEnts) April 6, 2024
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN… pic.twitter.com/Yu2AtVdPTW
చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు.. డబ్బులు కూడా ఇవ్వలేదు.. కళ్లు తెరిపించారు!
Comments
Please login to add a commentAdd a comment