ప్రభాస్‌ అన్నయ్య కోసమే ఈ నిర్ణయం.. సలార్‌పై నాని కామెంట్స్‌ | Actor Nani Comments On Prabhas At Hi Nanna Teaser Launch Event | Sakshi
Sakshi News home page

Hi Nanna: ప్రభాస్‌ అన్నయ్య కోసమే ఈ నిర్ణయం.. సలార్‌పై నాని కామెంట్స్‌

Published Mon, Oct 16 2023 7:55 AM | Last Updated on Mon, Oct 16 2023 8:27 AM

Actor Nani Comments On Prabhas At Hi Nanna Teaser Launch Event - Sakshi

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇక ఈ టీజర్ ఈవెంట్ లో నాని.. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను మీడియాతో పంచుకున్నాడు.  మొదటి హయ్ నాన్న సినిమా డిసెంబర్ చివరి వారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ..  డిసెంబర్ 22న ప్రభాస్‌ సలార్‌ వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో నాని సినిమా టీమ్‌ కూడా అలెర్ట్‌ అయింది. దీంతో వెంటనే హాయ్‌ నాన్న సినిమాను డిసెంబర్‌ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

సలార్ సినిమా రావడంతో హాయ్‌ నాన్న సినిమా ముందుగా విడుదల చేయడం ఎలా అనిపిస్తుందని పలువురు మీడియా  ప్రతినిధులు ప్రశ్నించగా..  చాలా చాకచక్యంగా సినిమా విడుదల తేదీలో మార్పు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 'ఒక ఇంట్లో పెద్ద అన్నయ్యకు సంబధించిన ఏదైనా వేడుక వుంటే.. అప్పుడు చిన్నోడి వేడుకని వాయిదా వేసుకుంటాడు.. తేదీని కూడా మార్చుకుంటాడు. ఇది సహజం. దీని వలన ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ అంతా ఒక లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి.' అని ప్రభాస్‌ సలార్‌ సినిమా గురించి నాని చెప్పాడు.ఆ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ సినిమాలతో నిర్మాతలకు నష్టం
నాని సినిమా కలెక్షన్లపై ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ లాంటి సినిమాలు చాలా బాగున్నాయని టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం రాలేదని, నిర్మాతలు నష్టపోయారని టాక్ ఉందని, దీనిపై మీ స్పందేనంటని ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి నాని ఘాటుగానే స్పందించారు.  ఈ మాట ఏ నిర్మాత చెప్పారో చెప్పండి. నా గత సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన వేదిక కాదనుకుంటున్నా. థియేరిటికల్‌, నాన్‌ థియేరిటికల్‌, రీమేక్‌.. ఇలా అన్ని విధాలుగా నా సినిమాలు మంచిగానే వసూళ్లను అందుకుంది.

‘జెర్సీ’కి రూ.10 రూపాయలు పెడితే.. రూ. 50 రూపాయలు వచ్చాయి. థియేట్రికల్ బిజినెస్ 30 రూపాయలకు జరిగితే 70 రూపాయలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని వివరించారు. సోషల్‌ మీడియాలో తెలిసి తెలియని వాళ్లు ఇలాంటి మాటలు అనొచ్చు కానీ..అన్నీ తెలిసిన మీడియా సరైన రీజనింగ్‌తో సరిగ్గా అడ్రస్‌ చేయాలి. మీకు దగ్గరకు వచ్చిన మాటలు నిజం కాదని తెలిసినప్పుడు.. ఆ విషయం అందరికి తెలియజేసే బాధ్యత కూడా మీదే(మీడియా) అని నాని కోరాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement