ప్రభాస్‌ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్న ముగ్గురు టాప్‌ హీరోలు | Prabhas Salaar Release Date Confusion Troubling The Other Films Of Top Heroes, Deets Inside - Sakshi
Sakshi News home page

Salaar Movie: ప్రభాస్‌ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్న ముగ్గురు టాప్‌ హీరోలు

Published Wed, Sep 27 2023 11:28 AM | Last Updated on Wed, Sep 27 2023 1:03 PM

Prabhas Salaar Release Date Confused Troubling The Other Films - Sakshi

సలార్ టీజర్‌లోని కొన్ని పదాలలో ‘సింపుల్ ఇంగ్లిష్ - నో కన్ఫ్యూజన్’ మొదటిది. అయితే, ఈ ప్రాజెక్ట్ విడుదల తేదీ నుంచి అన్నీ కన్ఫ్యూజన్‌ అని ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో సినిమా విడుదల అని చెప్పి చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో చాలా సినిమాలు తేదీని ఎంచుకోవడానికి దారితీసింది. దీంతో సలార్‌ విడుదల కావాల్సిన రోజుకు స్కంద,చంద్రముఖి-2 వచ్చేశాయి.

అయితే తాజాగా సలార్‌ చిత్రం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్‌ అవుతుందని వార్తలు బలంగా వస్తున్నాయి. సలార్‌ డిసెంబర్‌ 22న విడుదల అవుతుంది అని సోషల్‌ మీడియాలో ఈ వార్త బాగా వైరల్‌ అవుతుంది. సలార్‌ వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది. ఒకవేళ 'సలార్' డిసెంబర్ 22న విడుదలైతే..  ముందే ఆరోజును టార్గెట్‌ చేసుకున్న సినిమాల విడుదల తేదీలు మార్చాల్సి వస్తుంది. ఈ సినిమా నిర్మాతలు వేరే తేదీ కోసం మళ్లీ వెతుక్కోవాలి. ఎప్పటి నుంచో క్రిస్మస్ సెలవుల్లో తమ సినిమాలను విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్‌ చేసుకుని ఉన్నారు.

(ఇదీ చదవండి: దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్‌ పోస్ట్‌)

డిసెంబర్ 21, 22, 23 తేదీలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందస్తు ప్రణాళికలు పెట్టుకున్నారు. తాజాగా డైనాసర్‌ సడన్ గా విడుదల తేదీని డిసెంబర్‌ 22 అని ప్రకటిస్తే వాటి పరిస్థితి ఏంటి అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఈ అంశంపై సలార్‌ మేకర్స్‌పై భారీ విమర్శలు వస్తున్నాయి. సినిమా వాయిదా పడుతుంది అని చెప్పడానికి సు

డిసెంబర్‌21న నాని- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' విడదల అవుతుందని ఆ చిత్ర నిర్మాణ మేకర్స్‌ ఎప్పుడో ప్రకటించారు. డిసెంబర్ 22న, వెంకటేష్ 'సైంథవ్'  కూడా లైన్‌లో ఉంది. డిసెంబర్ 23న నితిన్- వక్కంతం వంశీ  'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' విడుదల కానుంది. ఇలా ఈ మూడు సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ముందే ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు సలార్‌పై వస్తున్న వార్తల వల్ల ఈ చిత్రాల నిర్మాతల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. సలార్‌ సినిమా అప్డేట్స్‌ ఇవ్వడంలో మేకర్స్‌ చాలా అలసత్వం వహిస్తున్నారనే చెడ్డపేరు ఉంది.

(ఇదీ చదవండి: ప్రియమణిపై మరో రూమర్స్‌.. జీర్ణించుకోలేకపోతున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌)

ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా కనీసం ఇప్పటికీ సలార్‌ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎందుకని సంక్రాంతికి 'సైంథవ్'  చిత్రాన్ని విడుదల చేయాలని వెంకటేశ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. సలార్‌ మేకర్స్‌ నిర్ణయాల వల్ల ప్రభాస్‌తో పాటు ముగ్గురు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైన సలార్‌ మేకర్స్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడటం తప్ప చేసేది ఏం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement